Fish Looted | బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) నితీశ్ కుమార్ (Nitish Kumar) పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన చేపలను స్థానికులు లూటీ (Fish Looted) చేశారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
బీహార్‌లోని సహర్సా జిల్లాలో శుక్రవారం సీఎం నితీశ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అమర్పూర్లో మత్స్యశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను (Exhibition) కూడా సీఎం పరిశీలించారు. ఎగ్జిబిషన్లో భాగంగా బయోఫ్లోక్ ట్యాంక్‌లో పెద్ద ఎత్తున చేపలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అక్కడ గందరగోళ పరిస్థితి తలెత్తింది.
సీఎం అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత స్థానికులు చేపలను లూటీ చేశారు. చేపల కోసమే ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చామని, సీఎంని చూడటం కంటే చేపలు పట్టడం పైనే ఎక్కువ ఆసక్తి ఉందని అక్కడికి వచ్చిన వారు చెప్పడం గమనార్హం. ఈ ఘటన కారణంగా తమకు సుమారు రూ.45 వేల నష్టం వాటిల్లినట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి సుబోధ్ కుమార్ తెలిపారు. చేపలను ప్రజలు లూటీ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
‘Sarkari Fish’ looted by people as soon as CM Nitish Kumar left the exhibition venue. 👀 🐠 pic.twitter.com/V8PItPpsS4
— Cow Momma (@Cow__Momma) September 21, 2024
Also Read..
Rishabh Pant : కారు ప్రమాదం నుంచి కోలుకుని.. అద్భత సెంచరీతో ఆకట్టుకున్న రిషబ్ పంత్
Jani Master | జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. భార్యపై కేసు.?