Ram Charan – Upasana | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు గత నెల ఆస్ట్రేలియా వెకేషన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలో జరిగిన ఇండియన్ ఫిలిం ఫెస్ట్‌వల్‌కు ముఖ్య అతిథిగా హాజరుకావడానికి రామ్ చరణ్ వెళ్లాడు. అయితే రామ్ చరణ్‌తో పాటు అతడి భార్య ఉపాసన, కూతురు క్లింకార కూడా ఆస్ట్రేలియా వెళ్లి సందడి చేసింది. అయితే నెల కిందట వెళ్లిన ఆస్ట్రేలియా వెకేషన్ ఫొటోలను
ఉపాసన తాజాగా పోస్ట్ చేసింది. ఈ ఫొటోలలో రామ్ చరణ్ ఫ్యామిలీ ఆస్ట్రేలియాలో కనపడే కంగారూలు, కోలా జంతువులతో సరదాగా ఆడుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
శంకర్‌తో గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రామ్ చరణ్ ఆర్సీ16 పనుల్లో బిజీగా ఉన్నాడు. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాకు ఉప్పెన ఫేం బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.