Iran warning | పోర్టులకు దూరంగా ఉండండి.. యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్.. ముస్లిం దేశాలు ఏకం కావాలని పిలుపు
Iran warning : గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. శనివారం దుబాయ్, బహ్రెయిన్ సహా పలు దేశాలపై దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో పోర్టులకు దూరంగా ఉండాలని యూఏఈ వాసులను ఇరాన్ హెచ్చరించింది.
Iran warning : గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. శనివారం దుబాయ్, బహ్రెయిన్ సహా పలు దేశాలపై దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో పోర్టులకు దూరంగా ఉండాలని యూఏఈ వాసులను ఇరాన్ హెచ్చరించింది. ఈ పోర్టులకు సమీపంలో దాడులకు దిగుతామని తెలిపింది. ఇక్కడి రహస్య మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా దాడి చేస్తామని హెచ్చరించింది. ఇకపై యుద్ధంలో ప్రమాదకర బాలిస్టిక్ మిస్సైల్స్ ఉపయోగిస్తామని వెల్లడించింది.
అలాగే మరింత ప్రభావవంతమైన ఆయుధాల్ని కూడా వినియోగించబోతున్నామని, అవి భారీ విధ్వంసం సృష్టిస్తాయని ఇరాన్ తెలిపింది. ఈ యుద్ధాన్ని అమెరికాయే మొదలుపెట్టింది, తమను తాము రక్షించుకునేందుకు సిద్ధమని ఇరాన్ మరోసారి ప్రకటించింది. ఇండియాలోని ఇరాన్ ప్రతినిధి డా.అబ్దుల్ మాజిద్ మాట్లాడుతూ తాము దేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతామన్నారు. శతృవుల ముందు లొంగిపోబోమని, యుద్ధం ముగిసేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల విషయంలో ముస్లిం దేశాలన్నీ ఒక్కటి కావాలని ఇరాన్ సైనిక దళాల ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ అబాల్ఫజ్ షెకార్చి కోరారు.
అమెరికా, జియోనిస్టులకు వ్యతిరేకంగా ముస్లిం దేశాలు ఏకతాటిపైకి రావాలని ఇరాన్ అధికార మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాడు. ఇస్లామిక్ రిపబ్లిక్‌ను, ముస్లిం ప్రజలను నమ్మాలని, విశ్వాసం లేని, బహుదేవతారాధన కలిగిన, కపట చర్యలకు వ్యతిరేకంగా ముస్లి సమాజం అంతా సంఘీభావం తెలపాలని అబాల్ఫజ్ కోరాడు. అమెరికా, జియోనిస్టుల నాయకత్వాన్ని ఎదుర్కొనేందుకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

