అమరావతి : ఏపీలో వైసీపీ నాయకులు వరుస రాజీనామాలు చేస్తున్నారు. ఆ పార్టీకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే త్వరలో జనసేన పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే రెండురోజులుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను(Udayabhanu) ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే .
మాజీ ఎమ్మెల్యే కిలారీ రోశయ్య జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో శనివారంమంగళగిరి పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆయనతో పాటు వియ్యంకుడు రవిశంకర్ కూడా ఆదివారం జనసేనలో చేరనున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన నేతలంతా జనసేనలో చేరనున్నారు.