మంగళవారం 26 మే 2020
Sports - May 23, 2020 , 00:05:22

అది ప్రతిపాదన మాత్రమే

అది ప్రతిపాదన మాత్రమే

  • దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌పై బీసీసీఐ కోశాధికారి

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా ఆగస్టులో దక్షిణాఫ్రికాతో మూ డు టీ20ల సిరీస్‌ ఆడుతుందని పక్కాగా చెప్పలేమని.. ప్రస్తు తం ఈ ప్రతిపాదన చర్చల దశలోనే ఉందని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ అన్నా రు. కొవిడ్‌-19 ప్రభావం తగ్గిన అనంతరం ఆగస్టులో భారత జట్టు సఫారీలతో పొట్టి సిరీస్‌ ఆడుతుందని గురువారం సీఎస్‌ఏ  క్రికెట్‌ డైరెక్టర్‌ గ్రేమ్‌ స్మిత్‌ పేర్కొన్న నేపథ్యంలో ధుమాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కరోనా కారణంగా దక్షిణాఫ్రికా పర్యటన అర్ధాంతరంగా ముగియడంతో ఈ దిశగా చర్చలు జరిగిన మాట వాస్తవమే. కానీ కచ్చితంగా ఆగస్టులో సిరీస్‌ ఉంటుందని మాట మాత్రం ఇవ్వలేదు’ అని ధుమాల్‌ అన్నారు. 


logo