FIH Pro League : హాకీ లీగ్‌లో భారత పురుషుల జట్టు జర్మనీ(Germany)కి షాకిస్తూ భారీ విజయం సాధించింది. లండన్‌లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్(FIH Pro League)లో పరాజయాలతో సతమతమైన టీమిండియా బలమైన జర్మనీపై 3-0తో జయభేరి మోగించింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్(Harmanpreet Singh) తొలి గోల్ అందించగా.. రెండో అర్ధ భాగంలో భారత ఆటగాళ్లు రెచ్చిపోయారు. జర్మనీ డిఫెండర్లను బోల్తా కొట్టించి బంతిని రెండు సార్లు గోల్‌పోస్ట్‌లోకి పంపారు. దాంతో, భారత జట్టు సూపర్ విక్టరీతో పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది.
Victory for the boys in blue 💪🏻
India triumphs over Germany in a thrilling match! 🔥#HockeyIndia #IndiaKaGame #FIHProLeague #IndiaMensTeam
.
.
.
.@CMO_Odisha @FIH_Hockey @sports_odisha @IndiaSports @Media_SAI @Limca_Official @CocaCola_Ind pic.twitter.com/e8GesMHI0K— Hockey India (@TheHockeyIndia) June 1, 2024
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 16వ నిమిషంలో బోణీ చేయగా.. సుఖ్జీత్ బ్యాక్ హ్యాండ్‌తో రెండో గోల్‌తో ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఆ కాసేపటికే జర్మనీప్రీత్ సింగ్(Jarmanpreet Singh) మూడో గోల్‌తో జర్మనీ జట్టు డీలా పడిపోయింది. అయితే.. ప్రత్యర్థి ఆటగాళ్లు పలుమార్లు గోల్ ప్రయత్నాలు చేసినా భారత గోల్ కీపర్ శ్రీజేష్ (Sreejesh) సమర్ధంగా అడ్డుకున్నాడున. ఈ విజయంతో టీమిండియా 24 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. అర్జెంటీనా, నెదర్లాండ్స్ జట్లు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.