చెన్నై: కోడిని వేటాడేందుకు చిరుత ప్రయత్నించింది. ఎత్తైన గోడపైకి అది దూకింది. కోడి భయంతో గోడకు మరోవైపు దూకింది. చిరుత కూడా అటు దూకి ఆ కోడిని వేటాడింది. దానిని నోటకరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Leopard Hunts Hen) తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మే 29న తెల్లవారుజామున 5 గంటలకు సోమయనూర్ గ్రామంలోని ఒక ఇంటి గోడపై కోడి ఉంది. ఒక చిరుత ఆ కోడిని గమనించింది. దానిని వేటాడేందుకు పది అడుగుల ఎత్తైన ఆ గోడపైకి దూకింది. అయితే కోడి గోడ అటువైపు దూకింది. చిరుత కూడా అటు దూకి ఆ కోడి వెంటపడింది. చివరకు దానిని నోటకరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.
మరోవైపు ఆ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చిరుత సంచారం గురించి తెలుసుకున్న గ్రామస్తులు భయాందోళన చెందారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
#WATCH | Tamil Nadu: A leopard caught jumping and catching a hen on camera, in Coimbatore. pic.twitter.com/ZigYG6NxhJ
— ANI (@ANI) May 30, 2024