INDW vs ENGW : సొంతగడ్డపై ఇంగ్లండ్(England)తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత జట్టు 347 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. దాంతో, టెస్టు ఫార్మాట్లో అతి పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తద్వారా ఇప్పటివరకూ శ్రీలంక పేరిట ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. 1998లో లంక 309 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను మట్టకరిపించింది.
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో మొదటి రోజు నుంచి పూర్తి ఆధిపత్యం చెలాయించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన మూడో రోజు మ్యాచ్ ముగించడం విశేషం. సంచలన బౌలింగ్‌తో రాణించిన దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికైంది. రెండో ఇన్నింగ్స్‌ను 186 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన భారత్.. ఇంగ్లండ్‌ను 131 రన్స్‌కే పరిమితం చేసింది.
India register a comprehensive Test win against England in Mumbai 🙌#INDvENG | 📝 https://t.co/9lGCzESrXx pic.twitter.com/Q6EyWMMpxT
— ICC (@ICC) December 16, 2023
తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన దీప్తి.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 4 వికెట్లు తీసి ఇంగ్లీష్ జట్టును దెబ్బకొట్టింది. ఆమెతో పాటు ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ మూడు వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్ 131 రన్స్‌కే కుప్పకూలింది. ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ హీథర్ నైట్(21), చార్లొట్టె డీన్(20) మాత్రమే రాణించారు.
తొలి ఇన్నింగ్స్‌లో నలుగురు భారత బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. సుభా సతీశ్(69), జెమీమా రోడ్రిగ్స్(68), యస్తికా భాటియా(66), దీప్తి శర్మ(67) హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో కొండంత స్కోర్ చేసింది. వచ్చినవాళ్లు వచ్చినట్టు ఇంగ్లండ్ బౌలర్లను చీల్చిచెండాడంతో 428 పరుగులు బాదింది. అనంతరం దీప్తి విజృంభణతో ఇంగ్గండ్ తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే పరిమితమైంది.
Mohammad Siraj | ఫలించిన సిరాజ్ నిరీక్షణ.. భావోద్వేగానికి లోనైన స్పీడ్‌స్టర్
Mohd. Shami: టెస్టులకు షమీ.. వన్డేలకు చాహర్ దూరం