లైట్ తీసుకుంటే.. లైసెన్స్ రద్దు
వాహనదారుల నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై డ్రైవింగ్ లైసెన్స్ రద్దును ప్రయోగిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై , ట్రాఫిక్, రవాణా నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల పదిహేను రోజుల్లో 17 లైసెన్స్‌లు రద్దు అ య్యాయి. మరో 150 లైసెన్స్‌ల రద్దు ప్రక్రియను ఆర్టీఏ అధికారులు వేగవంతం చేశారు. తొలుత జరిమానాలతో సరిపెడుతూనే , పదేపదే నిబంధనలు ఉల్లంఘించేవారి డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేస్తున్నారు.
- వాహనదారులు బీ అలర్ట్..
- నిబంధనల అతిక్రమించేవారిపై కఠిన చర్యలు
- 15 రోజుల్లో 17 డ్రైవింగ్ లైసెన్స్‌ల రద్దు
- ఆర్టీఏ పరిశీలనలో మరో 150
- మద్యం తాగి వాహనం నడిపినవారే అధికం
సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 ( నమస్తే తెలంగాణ ) : వాహనదారుల నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై డ్రైవింగ్ లైసెన్స్ రద్దును ప్రయోగిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై , ట్రాఫిక్, రవాణా నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల పదిహేను రోజుల్లో 17 లైసెన్స్‌లు రద్దు అ య్యాయి. మరో 150 లైసెన్స్‌ల రద్దు ప్రక్రియను ఆర్టీఏ అధికారులు వేగవంతం చేశారు. తొలుత జరిమానాలతో సరిపెడుతూనే , పదేపదే నిబంధనలు ఉల్లంఘించేవారి డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేస్తున్నారు.
ట్రాఫిక్ పోలీసుల నుంచి వచ్చే లైసెన్సుల రద్దు ప్రక్రియను వేగవంతం చేసి ఉల్లంఘనదారులను బెంబేలెత్తిస్తున్నారు. లైసెన్స్‌ను సస్పెం డ్ చేసేందుకు రెండు కేటగిరులుగా విభజించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులు మొదటి క్యాటగిరిగా, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు చోటుచేసుకుం టున్నవాటిని రెండో క్యాటగిరిగా వర్గీకరించి కేసులు నమోదు చేస్తున్నారు. వీటితో పాటు రోడ్డు ప్రమాదాల నివారణపై శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేసే ప్రక్రియపై కూడా కసరత్తు చేస్తున్నారు. అంతేకాదు లైసెన్స్ రద్దులో ఉన్నప్పుడు వాహనం నడుపుతూ దొరికితే జైలు శిక్ష కూడా పడే వీలుంది.
రద్దు ప్రకియ ఇలా..!
పోలీసుల నుంచి ఉల్లంఘనదారుడి వివరాలు రవాణాశాఖకు చేరుకుంటాయి. వారు పరిశీలించి సదరు వ్యక్తికి నోటీసులు పంపిస్తారు. పది రోజుల్లో అతను తన వివరణను ఆర్టీఏ అధికారులకు ఇవ్వా ల్సి ఉంటుంది. అనంతరం రవాణ శాఖ అధికారులు నిర్ణయం మేరకు లైసెన్స్ రద్దు ప్రక్రియ జరుగుతుంది.
రైద్దెన లైసెన్స్‌ల కారణాలు..!
- డ్రంకన్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఓవర్‌లోడ్ వాహనాలు, ఓవర్‌స్పీడ్
- గూడ్స్ వాహనాల్లో ప్రయాణికుల తరలింపు
- నిర్లక్ష్యపు డ్రైవింగ్, సిగ్నల్ జంప్ కారణాలు కోర్టు కేసుల నేపథ్యంలో రద్దు..
- ఇతర నిబంధనల ఉల్లంఘన
లైసెన్స్ రద్దు వివరాలు ఇలా…
జిల్లా : 2024 : 2025
హైదరాబాద్ : 3119 : 2178
రంగారెడ్డి : 2119 : 759
మేడ్చల్ : 2665 : 1210
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

