Mohd. Shami: టెస్టులకు షమీ.. వన్డేలకు చాహర్ దూరం
Mohd. Shami : సౌతాఫ్రికా టూర్ నుంచి షమీ, చాహర్ తప్పుకున్నారు. ఫిట్నెస్ లేకపోవడంతో షమీని టెస్టు సిరీస్‌కు దూరం చేశారు. ఇక వన్డేలకు దూరంగా ఉండనున్నట్లు చాహర్ తెలిపాడు. దీంతో బీసీసీఐ అతని స్థానంలో కొత్త పేసర్‌ను ప్రకటించంది.
ముంబై: సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు పేస్ బౌలర్ మహమ్మద్ షమీ(Mohd. Shami) దూరం కానున్నాడు. రెండు టెస్టుల సిరీస్ నుంచి అతన్ని తప్పించినట్లు ఇవాళ బీసీసీఐ ప్రకటన చేసింది. తొలుత షమీని టెస్టు బృందం కోసం ఎంపిక చేసినా.. అతని ఫిట్నెస్ సరిగా లేని కారణంగా తప్పించారు. టెస్టు సిరీస్ కోసం మెడికల్ బోర్డు షమీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్.. వన్డే జట్టు నుంచి వైదొలిగాడు. ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణాల వల్ల వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్లు బీసీసీఐకి దీపక్ చాహర్ చెప్పాడు. దీంతో అతన్ని తుది జట్టుకు ఎంపిక చేయడంలేదు. దీపక్ చాహర్ స్థానంలో ఆకాశ్ దీప్‌ను ఎంపిక చేశారు. ఆదివారం నుంచి సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానున్నది. ఆ తర్వాత ఆ జట్టుతో డిసెంబర్ 26 నుంచి రెండు టెస్టుల సిరీస్ జరగనున్నది.
🚨 NEWS 🚨
Deepak Chahar withdrawn from the ODI series; Mohd. Shami ruled out of the Test series.
Details 🔽 #TeamIndia | #SAvIND https://t.co/WV86L6Cnmt pic.twitter.com/oGdSJk9KLK
— BCCI (@BCCI) December 16, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

