Ticket Price | ఆంధ్రా ప్రయాణం మస్తు పిరం.. వేసవి సెలవులు, ఎన్నికలతో పెరిగిన రద్దీ
వేసవి సెలవులు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) చెందిన చాలా మంది హైదరాబాద్ నుంచి తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. ముఖ్యంగా ఏపీలో ఓట్ల తేదీ సమీపిస్తుండటంతో కుటుంబ సమేతంగా వెళుతున్నారు.
హైదరాబాద్: వేసవి సెలవులు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) చెందిన చాలా మంది హైదరాబాద్ నుంచి తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. ముఖ్యంగా ఏపీలో ఓట్ల తేదీ సమీపిస్తుండటంతో కుటుంబ సమేతంగా వెళుతున్నారు. దీంతో బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. బుకింగ్ చేసుకోవడానికి కూడా నెల రోజుల వరకు టికెట్లు దొరకని పరిస్థితి ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో చాలా మంది జనం ట్రావెల్ బస్సులను ఆశ్రయిస్తున్నారు.
ఇదే అదునుగా భావించిన కొన్ని ట్రావెల్స్ రెట్టింపు ధరలు (Ticket Price) వసూలు చేస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రూ.800 ధర ఉంటే సుమారు 2వేల పైనే వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. రైల్వే, ఆర్టీసీ అధికారులు ఏపీకి ప్రత్యేక రైళ్లు, బస్సు సర్వీసులను పెంచాలని ప్రయాణికులు కోరారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సుల్లో సీట్లను ఏర్పాటు చేసి ప్రయాణికుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. అధిక డబ్బులు వసూలు జేస్తున్న ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

