MLC Jeevan Reddy | నిజామాబాద్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి నిరసన సెగ.. ఆరు గ్యారంటీలపై జీవన్‌రెడ్డిని నిలదీసిన ప్రజలు
లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులపై ప్రజలు తిరగబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి (MLC Jeevan Reddy) నిరసన సెగ తగిలింది.
నిజామాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులపై ప్రజలు తిరగబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి (MLC Jeevan Reddy) నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి జీవన్‌రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తుండగా.. అడ్డుతగిన మహిళలు, ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆసరా పెన్షన్ ఇప్పటి వరకు ఎందుకు పెంచలేదని వృద్ధులు నిలదీశారు.
జనవరి నెలలో ఎగ్గొట్టిన పింఛన్ ఎప్పుడు ఇస్తారని అడిగారు. కల్యాణలక్ష్మి చెక్కులు, తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. మాయమాటలు చెప్పి మళ్లీ ఓట్లడుగుతున్నారని మహిళలు ఆగ్రమం వ్యక్తంచేశారు. ఐదు ఎకరాల కంటే అధికంగా ఉన్నవారికి రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని రైతులు నిలదీశారు. రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు చేస్తలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ ఎక్కడ? మీరు ఇప్పటి వరకు మాకు ఏమైనా చేసారా అంటూ ప్రశ్నించారు. జీవన్ రెడ్డి ప్రసంగానికి అడ్డుతగలొద్దని ఎమ్మెల్యే వారించినప్పటికీ వారు ఎంతకూ శాంతించకపోవడంతో మధ్యలోనే ప్రచారాన్ని ముగించుకుని ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కాంగ్రెస్ నాయకులపై తిరగబడ్డ మహిళలు
నిజామాబాద్ – ఇందల్వాయి మండలం, గన్నారం గ్రామంలో తిరగబడ్డ మహిళా సంఘాలు మరియు ఇల్లు లేని వాళ్లు.
ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి? ఉపాధి హామీ ఎక్కడ? మీరు ఇప్పటి వరకు మాకు ఏమైనా చేసారా అంటూ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని నిలదీశారు. pic.twitter.com/2xjseCILLt
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mrunal Thakur | రష్మిక పాత్ర కోసం వెళ్లి సీతగా.. ‘సీతారామం’ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఎంపిక వెనుక అసలు కథ ఇదే.!
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

