IND vs ENG 3rd ODI : ఇంగ్లండ్ (England) తో మూడో వన్డే (3rd ODI) లో భారత్ భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) సెంచరీ, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), యువ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Ayyar) హాఫ్ సెంచరీలతో కదం తొక్కడం, కేఎల్ రాహుల్ (KL Rahul) రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అర్షదీప్ సింగ్ (Arshadeep Singh) ఔట్‌తో భారత్ ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ ముందు 357 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
మ్యాచ్‌కు ముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత్‌కు ఇన్నింగ్స్ మొదట్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (1) రెండో ఓవర్ తొలి బంతికే ఔటయ్యాడు. ఆ తర్వాత శుభ్‌మాన్ గిల్‌కు విరాట్ కోహ్లీ జత కలిశాడు. గిల్, కోహ్లీ నిలకడగా ఆడుతూ 19 ఓవర్లలో జట్టు స్కోరును 120 పరుగులు దాటించారు. జట్టు స్కోర్ 122 పరుగులు ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ (52) ఔటయ్యాడు. దాంతో వారి 116 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. గిల్, అయ్యర్ కూడా నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరు కూడా 104 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత శుభ్‌మాన్ గిల్ (112) ఔటయ్యాడు. అప్పటికి 34.3 ఓవర్లలో జట్టు స్కోర్ మూడు వికెట్ల నష్టానికి 226 పరుగులు. ఆ తర్వాత అయ్యర్‌కు కేఎల్ రాహుల్ తోడయ్యాడు. వీళ్లిద్దరు ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డు స్పీడును మరింత పెంచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అయ్యర్ నాలుగో వికెట్ రూపంలో పెవిలియన్ బాటపట్టాడు. ఇక చివరి పది ఓవర్లలో భారీ స్కోర్ సాధించే ప్రయత్నంలో హార్దిక్ పాండ్యా (17), అక్షర్ పటేల్ (13), వాషింగ్టన్ సుందర్ (14), హర్షిత్ రాణా (13) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు పడగొట్టి భారత్ మరింత భారీ స్కోర్ సాధించకుండా అడ్డుకున్నాడు. మరో బౌలర్ మార్క్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇక సాకిబ్ మహ్మద్, గూస్ అట్కిన్సన్, జో రూట్ తలో వికెట్ తీసుకున్నారు. అయితే 8 ఓవర్లు బౌలింగ్ చేసిన లియామ్ లివింగ్ స్టోన్‌కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు.
IND vs ENG 3rd ODI | తొలి 50 ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు.. గిల్ ఖతాలో అరుదైన రికార్డు
Shubman Gill | ఇంగ్లండ్‌తో మూడో వన్డే.. శుభ్‌మాన్ గిల్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
Australia: సూపర్స్టార్లు దూరం.. చాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులు
Maha Kumbh: మహాకుంభ్‌లో పుణ్య స్నానం చేసిన క్రికెటర్ అనిల్ కుంబ్లే దంపతులు
INDvENG: కోహ్లీ 52 ఔట్, గిల్ హాఫ్ సెంచరీ