అహ్మదాబాద్: విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్.. అహ్మదాబాద్ వన్డేలో హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఇంగ్లండ్తో జరుగుతున్న మూడవ వన్డేలో ఆ ఇద్దరూ రెండో వికెట్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ ఇద్దరూ 116 రన్స్ జోడించారు. 51 బంతుల్లో గిల్ అర్థశతకాన్ని పూర్తి చేశాడు. దాంట్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. ఇక విరాట్ కోహ్లీ 50 బంతుల్లో 50 రన్స్ చేశాడు. అతని హాఫ్ సెంచరీలో ఏడు ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. అయితే రషీద్ బౌలింగ్లో 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
వన్డేల్లో కోహ్లీ 73వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇటీవల కాలం అతను సరైన ఫామ్లో లేని విషయం తెలిసిందే. వైస్ కెప్టెన్ గిల్ వన్డేల్లో 16వ హాఫ్ సెంచరీ కొట్టాడు. తాజా సమాచారం ప్రకారం ఇండియా 21 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 135 రన్స్ చేసింది.
Virat Kohli joins the party with his 73rd ODI FIFTY 💪💪
Live – https://t.co/S88KfhFzri… #INDvENG@IDFCFIRSTBank pic.twitter.com/R3OGjhDXnN
— BCCI (@BCCI) February 12, 2025