Shubman Gill : ఇంగ్లండ్ (England) తో మూడో వన్డే (3rd ODI) లో కూడా భారత్ తన సత్తా చాటుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జోస్ బట్లర్ (Jos butler) భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. రెండో ఓవర్ తొలి బంతికే ఇంగ్లండ్ బౌలర్ మార్క్‌వుడ్ (Mark Wood) హిట్‌మాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ను పెవిలియన్‌కు పంపాడు. దాంతో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనంతరం రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఓపెనర్ శుభ్‌మాన్ గిల్‌కు జతచేరాడు. గిల్ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
ఈ క్రమంలో 32వ ఓవర్ రెండో బంతిని బౌండరీకి తరలించడం ద్వారా గిల్ వన్డేల్లో తన ఏడో సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం 34 ఓవర్ల ఆట ముగిసేసరికి గిల్ 101 బంతుల్లో 112 పరగులతో క్రీజులో ఉన్నాడు. తన ఇన్నింగ్స్‌లో గిల్ మొత్తం 13 బౌండరీలు, 3 సిక్సులు బాదాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా నిలకడగా ఆడుతూ గిల్‌కు సహకారం అందించాడు. 55 బంతుల్లో 52 పరుగులు చేసిన గిల్ 19వ ఓవర్ ఆఖరి బంతికి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కూడా గిల్‌కు సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం అయ్యర్ 47 బంతుల్లో 51 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్ తలో వికెట్ తీశారు. 34 ఓవర్ల ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 225 పరుగులుగా ఉంది. ఇదే జోరు కొనసాగితే భారత్ భారీ స్కోర్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
Australia: సూపర్స్టార్లు దూరం.. చాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులు
Maha Kumbh: మహాకుంభ్‌లో పుణ్య స్నానం చేసిన క్రికెటర్ అనిల్ కుంబ్లే దంపతులు
INDvENG: కోహ్లీ 52 ఔట్, గిల్ హాఫ్ సెంచరీ