సిడ్నీ: ఆస్ట్రేలియా(Australia) క్రికెట్ జట్టులోని మేటి ఆటగాళ్లు చాలా మంది చాంపియన్స్ ట్రోఫీకి దూరం అవుతున్నారు. ఆ టోర్నీకి వెళ్లే బృందాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. పేస్ బౌలర్లు ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ .. టోర్నీ నుంచి తప్పుకున్నారు. ముగ్గురూ గాయాల వల్ల టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. కమ్మిన్స్ స్థానంలో ఆస్ట్రేలియా సారథిగా స్టీవ్ స్మిత్ బాధ్యతలు చేపట్టనున్నారు. 15 మంది సభ్యులు ఉన్న ఆ జట్టులో మార్కస్ స్టోయినిస్ కూడా లేడు. గత వారమే స్టోయినిస్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. మిచెల్ మార్ష్ గాయం వల్ల కూడా టోర్నీకి అందుబాటులో లేడు. ఆటగాళ్ల గాయాల వల్ల ఆసీస్ బృందంలో భారీ మార్పులు చేయాల్సి వచ్చిందని చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలిపారు.
Introducing our 15-player squad for the 2025 ICC #ChampionsTrophy 👊 pic.twitter.com/Rtv20mhXAW
— Cricket Australia (@CricketAus) February 12, 2025