IND vs ENG 3rd ODI : భారత ఓపెనింగ్ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) మరో అరుదైన రికార్డు (Rare record) ను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే మ్యాచ్‌లలో తొలి 50 ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అతడు రికార్డు నెలకొల్పాడు. ఇవాళ ఇంగ్లండ్ (England) తో జరిగిన వన్డేతో కలిపి మొత్తం 50 వన్డే ఇన్సింగ్స్ ఆడిన శుభ్‌మాన్ గిల్.. 2,587 పరుగులు చేశాడు. ఇంతవరకు ఏ బ్యాటర్ కూడా తొలి 50 ఇన్నింగ్స్‌లో ఇన్ని పరుగులు చేయలేదు. గిల్ తర్వాత స్థానాల్లో హషీమ్ ఆమ్లా (Hashim Amla) (2,486 పరుగులు), ఇమామ్ ఉల్ హక్ (Imam Ul Haq) (2,386 పరుగులు), ఫఖర్ జమాన్ (Fakhar Zaman) (2,262 పరుగులు), శాయ్ హోప్ (2,247 పరుగులు) ఉన్నారు.
కాగా ఇవాళ ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో గిల్ (112;102 బంతుల్లో, 14 ఫోర్లు, 3 సిక్సులు) అద్భుత ప్రదర్శన చేశాడు. 34వ ఓవర్ మూడో బంతికి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ నామమాత్రపు మూడో వన్డే జరుగుతోంది. ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో భారత్ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
Shubman Gill | ఇంగ్లండ్‌తో మూడో వన్డే.. శుభ్‌మాన్ గిల్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
Australia: సూపర్స్టార్లు దూరం.. చాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులు
Maha Kumbh: మహాకుంభ్‌లో పుణ్య స్నానం చేసిన క్రికెటర్ అనిల్ కుంబ్లే దంపతులు
INDvENG: కోహ్లీ 52 ఔట్, గిల్ హాఫ్ సెంచరీ