IND vs SL : పొట్టి సిరీస్‌ను విజయంతో ఆరంభించిన భారత జట్టు (Team India) మరో విజయంపై గురి పెట్టింది. తొలి మ్యాచ్‌లో పోరాడి ఓడిన ఆతిథ్య శ్రీలంక (Srilanka) సిరీస్ సమం చేయాలనే కసితో ఉంది. అయితే.. ఇరుజట్ల ఉత్సాహంపై వరుణుడు నీళ్లు చల్లేలా ఉన్నాడు.
ఆదివారం టీమిండియా, లంక మధ్య జరగాల్సిన రెండో టీ20కి ముందు పెద్ద వాన పడింది. దాంతో, పల్లెకెలె స్టేడియంలో ఔట్ ఫీల్డ్ తడిగా మారింది. అందుకని షెడ్యూల్ ప్రకారం 6:30 గంటలకు వేయాల్సిన టాస్‌ను అంపైర్లు వాయిదా వేశారు.
Update:
Rain has stopped
Toss at 7.15 PM IST
Start of Play: 07.45 PM IST#TeamIndia | #SLvIND https://t.co/vA3xO4mJBS
— BCCI (@BCCI) July 28, 2024
వర్షం తగ్గడంతో గ్రౌండ్ సిబ్బంది ఔట్ ఫీల్డ్‌లోని నీటిని తోడేస్తున్నారు. సూపర్ సాపర్స్ సాయంతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఔట్ ఫీల్డ్ ఆరితే రాత్రి 7 :15 గంటలకు టాస్ వేయనున్నారు. ఆ తర్వాత 30 నిమిషాలకు అంటే.. 7:45కి మ్యాచ్ మొదలవ్వనుంది.