Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,85,186.51 కోట్లు పెరిగింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), ఇన్ఫోసిస్ భారీగా లబ్ధి పొందాయి. గతవారం బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ 728.07 (0.90 శాతం) లబ్ధితో ముగిసింది. ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.44,907.49 కోట్లు వృద్ధి చెంది రూ.7,46,602.73 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.36,665.92 కోట్లు పుంజుకుని రూ.7,80,062.35 కోట్ల వద్ద స్థిర పడింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.35,363.32 కోట్ల లబ్ధితో రూ.6,28,042.62 కోట్ల వద్ద ముగిసింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,826.1 కోట్ల లబ్ధితో రూ.15,87,598.71 కోట్లకు చేరుకున్దని. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.30,282.99 కోట్లు వృద్ధితో రూ.8,62,211.38 కోట్ల వద్ద నిలిచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,140.69 కోట్ల లబ్ధితో రూ.12,30,842.03 కోట్ల వద్ద స్థిర పడింది.
మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.62,008.68 కోట్ల పతనంతో రూ.20,41,821.06 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.28,511.07 కోట్ల నష్టంతో రూ.8,50,020.53 కోట్లతో సరిపెట్టుకున్నది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.23,427.1 కోట్ల నష్టంతో రూ.7,70149.39 కోట్ల వద్ద ముగిసింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.3,500.89 కోట్ల పతనంతో రూ.6,37,150.41 కోట్ల వద్ద నిలిచింది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ టాప్ టెన్ సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, భారతీయ స్టేట్ బ్యాంక్, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ నిలిచాయి.
August Bank Holidays | ఆగస్టులో 13 రోజులూ బ్యాంకులకు సెలవులు.. కారణమిదే..!