Veera Dheera Sooran | విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్ చియాన్ విక్రమ్ (Vikram). ఈ స్టార్ హీరోకు తెలుగు, తమిళంతోపాటు ఇండియావైడ్‌గా ఏ రేంజ్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్యాక్టర్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి తంగలాన్. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు 15న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు విక్రమ్.
తంగలాన్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు విక్రమ్. ఇందులో భాగంగా కేరళలో సందడి చేసిన విక్రమ్‌కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. విక్రమ్ ఆర్కే వెడ్డింగ్ మాల్ లాంచింగ్‌లో పాల్గొన్నాడు. స్టైలిష్ షూట్ అండ్ గాగుల్స్‌లో సూపర్ గ్లోరియస్ లుక్‌లో అదరగొట్టేస్తున్నాడు. తమ అభిమాన హీరోను కలిసి ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు మూవీ లవర్స్. ఈ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
విక్రమ్ మరోవైపు ఛియాన్ 62ను కూడా లైన్లో పెట్టాడని తెలిసిందే. వీరధీరసూరన్ (VeeraDheeraSooran) టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ టైటిల్ టీజర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. విక్రమ్ పక్కా యాక్షన్ ప్యాక్డ్ కమర్షియల్ మూవీతో వస్తున్నాడని టీజర్ చెప్పకనే చెబుతోంది. ఈ చిత్రానికి చిన్నా ఫేం ఎస్‌యూ అరుణ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రమోషన్స్‌లో ఇలా..
#ChiyaanVikram @chiyaan at RK Wedding Mall launch, Kerala ❤️🔥🤩#Thangalaan #VeeraDheeraSooran pic.twitter.com/4wuEoFj4J8
— Ramesh Bala (@rameshlaus) July 28, 2024
@chiyaan‘s style is always on fleek! 😍😎#ChiyaanVikram🐐 #Thangalaan #VeeraDheeraSooran
Check out the latest post of our chief 👇🏻https://t.co/pBssoNc9BA@sooriaruna @Kalaiazhagan15 @mugeshsharmaa @proyuvraaj pic.twitter.com/1w574abSjj
— Chiyaan Vikram Fans (@chiyaanCVF) July 28, 2024
Kubera | బర్త్ డే స్పెషల్.. ధనుష్ కుబేర నయా లుక్ వైరల్
Raayan Review | ధనుష్ రాయన్గా మెప్పించాడా.. పర్ఫెక్ట్ బెంచ్‌మార్క్ సినిమానా.. ?
Raayan | ధనుష్ రాయన్ స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ ప్లాట్‌ఫాం ఇదే..!