Ashes Series : మెల్బోర్న్ టెస్టులో విజయంతో యాషెస్ సిరీస్‌లో బోణీ కొట్టిన ఇంగ్లండ్ (England) సిడ్నీలోనూ జోరు చూపించింది. సిరీస్‌లో మొట్టమొదటిసారి ఆ జట్టు బ్యాటర్లు క్రీజులో నిలబడి తొలి రోజే ఆలౌట్ గండాన్ని అధిగమించారు. ఓపెనర్లు విఫలమైనా.. హ్యారీ బ్రూక్(78 నాటౌట్), జో రూట్(72 నాటౌట్)లు ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదర్కొంటూ అర్ధ శతకాలు బాదారు. ఫలితంగా.. తొలిరోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.
సిడ్నీ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలి రోజు ఆధిపత్యం చెలాయించింది. వెలుతురు లేమి కారణంగా 45 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైనా పర్యాటక జట్టు మిడిలార్డర్ బ్యాటర్లు క్రీజునంటుకుపోయారు. ఓపెనర్లు బెన్ డకెట్(27), జాక్ క్రాలే(16)లు శుభారంభమిచ్చినా స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. కాసేపటికే బొలాండ్ ఓవర్లో జాకబ్ బెథెల్(10) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన జో రూట్(72 నాటౌట్), హ్యారీ బ్రూక్(78 నాటౌట్)లు ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వలేదు. 57కే మూడు కీలక వికెట్లు పడిన వేళ వీరిద్దరూ ఏకొంచెం తడబడినా, ఒక చెత్త షాట్ ఆడినా ఇంగ్లండ్ ఆలౌటయ్యేది.
All 3 England wickets to fall on Day 1 at the SCG 🏏
(available to view in India only 📹) pic.twitter.com/4fOd6vWTy2
— ESPNcricinfo (@ESPNcricinfo) January 4, 2026
కానీ, వీరు చెక్కుచెదరని ఏకాగ్రతతో క్రీజులో పాతుకుపోయి స్కోర్‌బోర్డును నడిపించారు. ఆస్ట్రేలియా బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ రూట్, బ్రూక్ అర్ధ శతకాలతో స్కోర్ 200 దాటించారు. నాలుగో వికెట్‌కు 150 పరుగులు రాబట్టడంతో ఆసీస్ బౌలర్లు నీరుగారిపోయారు. రెండో రోజు కూడా ఈ ద్వయం సెంచరీలు సాధిస్తే ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలిచినట్టే. వరుసగా..పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్‌లో ఓడిన ఇంగ్లండ్ సిరీస్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే.
Bad light brings an early tea break with a storm brewing in Sydney – Joe Root and Harry Brook have put on England’s biggest partnership of the series: 154* and counting 🤝
Live ball-by-ball: https://t.co/Cp0TTOQZAA pic.twitter.com/weP4eD4x6A
— ESPNcricinfo (@ESPNcricinfo) January 4, 2026