Nutritionist Nmami Agarwal : ఆహారానికి సంబంధించి మనలో ఎన్నో అపోహలున్నాయి. గుడ్డు తింటే ఆరోగ్యానికి మేలని కొందరు చెబుతుంటే ఎగ్‌తో కొలెస్ట్రాల్ పెరుగుతుందని మరికొందరు చెబుతుంటారు. గుడ్డులో అధిక ప్రొటీన్‌తో ఆరోగ్యానికి మేలని కానీ పరిమితంగా తీసుకుంటే మంచిదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఆహారంలో మంచీ, చెడు అంటూ ఉండవని ఏమైనా మితంగా, సమతూకంతో సమతులాహారం తీసుకోవాలని న్యూట్రిషనిస్ట్ మామి అగర్వాల్ సూచిస్తున్నారు. ఇన్‌స్టాగ్రాంలో తన లేటస్ట్ వీడియోలో ఆహారానికి సంబంధించిన అపోహలను క్లియర్ చేసే వివరాలను ఆమె పంచుకున్నారు.
ఈ వీడియోలో నాలుగు ఆహార పదార్ధాల గురించి ఆమె ప్రస్తావించారు. పోషకాలతో కూడిన నెయ్యిని సూపర్ ఫుడ్‌గా చెబుతుంటారు. అయితే మోతాదు మించితే మంచి ఆహారమైనా చెడుగా మారుతుంది. నెయ్యిని అధికంగా వేడి చేస్తే అనారోగ్యకర పదార్ధాలు పేరుకుపోయే ప్రమాదం ఉంది. నెయ్యిని డీప్ ఫ్రై చేయకుండా ఆహారం రుచి కోసం ఓ టేబుల్ స్పూన్ వాడటం మేలని, మితంగా దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని మామి అగర్వాల్ చెబుతున్నారు. ఇక రోజువారీ ఆహారంలో భాగమైన రైస్‌ను పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదు.
బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ప్రొటీన్, ఫైబర్‌తో బ్యాలెన్స్ చేసేలా చూసుకోవాలి. రైస్‌ను పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి జరిగే హాని ఏమీ లేదని చెప్పారు. ఇక ప్రొబయాటిక్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండే పచ్చళ్లను కూడా పరిమిత మోతాదులో తీసుకోవచ్చు. వీటిలో సోడియం అధికంగా ఉండటంతో మితంగా తినడం మేలని ఆమె సూచిస్తున్నారు.
ఇక కొబ్బరి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ఇందులో ఉండే ఆరోగ్యకర కొవ్వలు, ఎంసీటీలు మంచివని పేర్కొన్నారు. ఇందులో పోషకాలు అధికంగా ఉన్నా క్యాలరీలు కూడా ఎక్కువే కావడంతో దీన్ని మితంగా తీసుకోవాలి. సమతులాహారంలో భాగంగా కొబ్బరిని పరిమిత మోతాదులో తీసుకుంటే చాలు. ఏ ఆహారం తీసుకున్నా అన్ని రకాల పోషకాలు ఉండేలా సమతులాహారం తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పుకొచ్చారు.
Read More :