హైదరాబాద్ : కేటీఆర్(KTR) సవాల్‌కు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. కాళేశ్వరం(Kaleswaram project) పంపులను ఆగస్టు 2 లోగా ఆన్ చేయకుంటే 50 వేల మంది రైతులతో వచ్చి తామే ఆన్ చేస్తామని ఇచ్చిన అల్టిమేటానికి తలొగ్గింది. 24 గంటల్లోనే మధ్యమానేరు (శ్రీ రాజరాజేశ్వర) ప్రాజెక్టుకు ఎత్తిపోతలను ప్రారంభించింది. శనివారం ధర్మారం మండలం నంది పంప్‌హౌస్‌లో 4, రామడుగు మండలం గాయత్రీ పంప్‌హౌస్‌లో(Gayatri Pump House) 4 బాహుబలి మోటర్లను ఆన్ చేసింది. మొత్తంగా 12,600 క్యూసెక్కులను ఎత్తిపోస్తుండగా, రైతాంగం ఆనందపడుతున్నది. అన్నీ మంచిగానే ఉన్నాయని, కాంగ్రెస్ కావాలనే నీళ్లియ్యకుండా తమ పొలాలు ఎండబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
గాయత్రి పంప్ హౌజ్ ద్వారా నీటి విడుదల
డ్రోన్ 4K విజువల్స్
కేటీఆర్ సవాల్‌కు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. కాళేశ్వరం పంపులను ఆగస్టు 2 లోగా ఆన్ చేయకుంటే 50 వేల మంది రైతులతో వచ్చి తామే ఆన్ చేస్తామని ఇచ్చిన అల్టిమేటానికి తలొగ్గింది. 24 గంటల్లోనే మధ్యమానేరు (శ్రీ రాజరాజేశ్వర)… pic.twitter.com/EfCBQmmJXc
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2024