Womens Under – 19 Asia Cup : మహిళల అండర్ – 19 ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. టీ20 ఫార్మాట్లో జరుగబోయే ఈ మెగా టోర్నీ మలేషియా (Malaysia) వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు కానుంది. ఆసియా కప్ టోర్నీ షెడ్యూల్ను బుధవారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) విడుదల చేసింది. దాంతో, చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్ల ఎప్పుడు తలపడుతాయి? అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
డిసెంబర్ 15న జరుగబోయే ఆరంభ పోరులోనే దాయాదుల పోరు క్రీడాభిమానులను అలరించనుంది. డిసెంబర్ 22వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగనుందని ఐసీసీ తెలిపింది.
The ACC Women’s U19 Asia Cup is ready for it’s inaugural season, starting December 15. Malaysia plays host to the inaugral edition with 6 young teams fighting for Asian supremacy!#WomensU19AsiaCup #ACC pic.twitter.com/am8HDBblwQ
— AsianCricketCouncil (@ACCMedia1) November 13, 2024
మహిళల అండర్ 19 ఆసియా కప్ రౌండ్ రాబిన్ పద్దతిలో జరుగనుంది. లీగ్ దశలో ఆరు మ్యాచ్లు నిర్వహిస్తారు. ఆపై టాప్ -4 జట్లు సూపర్ 4కు అర్హత సాధిస్తాయి. అనంతరం సెమీ ఫైనల్.. డిసెంబర్ 22వ తేదీన టైటిల్ పోరు జరుగనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, నేపాల్ ఉండగా.. గ్రూప్ బీలో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా ఉన్నాయి.