తిరుమల : వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో (Vyra Entertainments banner) నిర్మించిన మట్కా (Matka) చిత్ర బృందం బుధవారం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకుంది. తిరుపతిలో నిర్వహిస్తున్న మట్కా మూవీ ప్రమోషన్లలో భాగంగా హీరో వరుణ్‌తేజ్‌తో ( Hero Varuntej ) పాటు టీం సభ్యులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మట్కా మూవీ సూపర్ హిట్ కావాలని ప్రత్యేక పూజుల చేశారు.
ఈ సందర్భంగా ఆలయాధికారులు వీరికి సాదర స్వాగతం పలికారు. అనంతరం దర్శనం చేయించారు. ఆలయ పండితులు వీరికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు. గురువారం ఈ సినిమా విడుదల కానుంది.
మట్కా జూదాన్ని ముంబైలో ప్రారంభించిన రతన్ ఖాత్రి జీవితం ఆధారంగా దర్శకుడు మట్కా సినిమాను తెరకెక్కించారు. బర్మా నుంచి శరణార్థిగా వచ్చిన వాసు.. వైజాగ్ ను ఎలా శాసించాడనేది ఈ సినిమాలోని సారాంశం. ఇంకా ఈ మూవీలో సలోని, సత్యం రాజేష్, రవి శంకర్, కిషోర్, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.