హైదారాబాద్ : నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని చందనపల్లి ప్రాంతంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మునుగోడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ షేక్ తయూబ్ దుర్మరణం చెందడంపై డీజీపీ శివధర్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. ఎన్నికల విధులను నిర్వహించి, తిరిగి వెళ్తున్న క్రమంలో డీసీఎం వాహనం ఢీకొని మృత్యువు కబళించడం కలచివేసిందని డీజీపీ ఆవేదన వ్యక్తంచేశారు.
విధి నిర్వహణలో ఒక యువ కానిస్టేబుల్ను కోల్పోవడం పోలీస్ శాఖకు తీరని లోటు అని, తయూబ్ సేవలు మరువలేనివి అని డీజీపీ అన్నారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి పోలీస్ శాఖ అన్ని విధాలా అండగా ఉంటుందని డీజీపీ భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో షేక్ తయుబ్ను కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబసభ్యులు మనోధైర్యంతో ఉండాలన్నారు.