Election Commission | మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎక్స్అఫీషియో ఓటుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నియోజకవర్గ పరిధిలో ఎక్స్అఫీషియో ఓటు వినియోగించుకోవడం వివరణ ఇచ్చింది.
ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ నియోజకవర్గ పరిధిలోని ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో ఓటు వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అదే ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు అయితే ఓటు ఉన్న మున్సిపాలిటీలోనే ఎక్స్అఫీషియో ఓటు వినియోగించుకోవాలని సూచించింది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం సగం మున్సిపాలిటీలను మాత్రమే దక్కించుకుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లో కేవలం 66 మున్సిపాలిటీలకే పరిమితమైంది. ఏడు కార్పొరేషన్లలో 3 మాత్రమే దక్కించుకుంది. ఫలితంగా 36 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. ఈ క్రమంలో హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో స్వతంత్రులతో పాటు ఎక్స్అఫీషియో ఓటు కీలకంగా మారింది. ఇక, ఈ నెల 16వ తేదీన మున్సిపల్ చైర్పర్సన్, కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక జరగనుంది.