Abhishek Sharma: ట్రైనింగ్ సెషన్లో పాల్గొననున్న అభిషేక్ శర్మ.. కొలంబో చేరుకున్న అతని పేరెంట్స్
Abhishek Sharma: ఇండియన్ బ్యాటర్ అభిషేక్ శర్మ .. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడుతాడో లేదో ఇంకా స్పష్టంగా తెలియదు. ఇవాళ జరిగే ట్రైనింగ్ సెషన్ ఆధారంగా అతని ఫిట్నెస్ను పరీక్షించనున్నారు. అయితే అభిషేక్ పేరెంట్స్ మాత్రం ఇప్పటికే కొలంబో చేరుకున్నారు.
కొలంబో: ఇండియన్ బ్యాటర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) .. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడుతాడో లేదో ఇంకా స్పష్టంగా తెలియదు. టీ20 వరల్డ్‌కప్‌లో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అతను ఆడని విషయం తెలిసిందే. తీవ్రమైన కడుపు ఇన్ఫెక్షన్ కావడంతో ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో అతను చికిత్స పొందాడు. పాక్‌తో మ్యాచ్‌లో ఆడేందుకు భారత జట్టు కొలంబో చేరున్నది. ఇవాళ తెల్లవారుజామున ఇండియా జట్టుతో పాటు అభిషేక్ శర్మ కూడా కొలంబో చేరుకున్నాడు. ప్రేమదాస స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌కు అభిషేక్ తుది జట్టులో ఉంటాడో లేదో ఇంకా క్లారిటీ లేదు.
భారత జట్టు శనివారం ప్రేమదాస స్టేడియంలో ట్రైనింగ్ సెషన్లో పాల్గొననున్నది. అభిషేక్ ఫిట్నెస్ ఆధారంగా అతన్ని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ట్రైనింగ్ సెషన్లో అతని ప్రదర్శన ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఇప్పటికే అభిషేక్ శర్మ పేరెంట్స్ కొలంబో చేరుకున్నారు. అభిషేక్ ఏ టూర్‌కు వెళ్లినా అతని తండ్రి రాజ్‌కుమార్ శర్మ అక్కడకు వెళ్తుంటాడు. చిన్నతనం నుంచి అభిషేక్‌కు అతనే కోచింగ్ చేశాడు. దుబాయ్‌లో జరిగిన ఆసియాకప్ సమయంలో అభిషేక్ వెంటే పేరెంట్స్ ఉన్నారు. ఒకవేళ పాక్‌తో మ్యాచ్‌కు అభిషేక్ అందుబాటులో లేకుంటే అప్పుడు సంజూ శాంసన్ లేదా వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

