West Indies : తొలి రెండు టీ20ల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయిన వెస్టిండీస్‌కు భారీ షాక్. సిరీస్‌లో కీలకమైన మూడో మ్యాచ్‌తో పాటు సిరీస్ మొత్తానికి స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ (Andrew Russell) దూరమయ్యాడు. ఎడమ మోకాలి గాయంతో బాధ పడుతున్న రస్సెల్‌కు విశ్రాంతి ఇవ్వడం అనివార్యమైంది. దాంతో, విండీస్ సెలెక్టర్లు అతడి స్థానంలో షమర్ స్ప్రింగర్ను స్క్వాడ్‌లోకి తీసుకున్నారు.
ఇక.. వన్డే సిరీస్‌లో దురుసు ప్రవర్తనతో రెండు మ్యాచ్‌ల నిషేధానికి గురైన సీనియర్ పేసర్ అల్జారీ జోసెఫ్ (Alzarri Joseph) మళ్లీ జట్టుతో కలిశాడు. యువ పేసర్ షమర్ జోసెఫ్ స్థానంలో అల్జారీ విండీస్ స్క్వాడ్‌లోకి వచ్చాడు.
Gets angry! 😡
Bowls a wicket maiden 👊
Leaves 🤯An eventful start to the game for Alzarri Joseph! 😬#WIvENGonFanCode pic.twitter.com/2OXbk0VxWt
— FanCode (@FanCode) November 6, 2024
వన్డే సిరీస్ గెలుపొందిన కరీబియన్ జట్టుకు ఇంగ్లండ్ పెద్ద ఝలక్ ఇచ్చింది. కెప్టెన్ జోస్ బట్లర్, ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్‌ల మెరుపులతో వరుసగా రెండు టీ20ల్లో విజయదుందుభి మోగించింది. దాంతో, ఇక సిరీస్ కాపాడుకోవాలంటే చివరి మూడు మ్యాచుల్లో వెస్టిండీస్ కచ్చితంగా గెలవాలి.
Massive blow for the West Indies as Andre Russell is ruled out from the remainder of the T20I series against England ❌
📝 #WIvENG | More ➡️ https://t.co/nWJ7PjQv6B pic.twitter.com/QE9IowFuEv
— ICC (@ICC) November 13, 2024
పొట్టి ఫార్మాట్లో చెలరేగి ఆడే విండీస్ బ్యాటర్లు దంచికొడితే తప్ప సిరీస్ దక్కని పరిస్థితి. కానీ, వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న బట్లర్ బ్యాచ్ హ్యాట్రిక్ విక్టరీతో సిరీస్ పట్టేయాలనే కసితో ఉంది. దాంతో, చావోరేవో లాంటి మూడో టీ20లో గెలుపే లక్ష్యంగా ఆతథ్య జట్టు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.
వెస్టిండీస్ టీ20 స్క్వాడ్ : రొవ్మన్ పావెల్(కెప్టెన్), రోస్టన్ చేజ్, మాథ్యూ ఫొర్డే, షిమ్రాన్ హిట్మైర్, టెర్రాన్సే హిండ్స్, షాయ్ హోప్, అకీల్ హొసేన్, అల్జారా జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లెవిస్, గుడకేశ్ మోతీ, నికోలస్ పూరన్, రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్, షమర్ స్ప్రింగర్.