అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం (Low pressure) కారణంగా ఏపీలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రానున్న మూడురోజుల్లో కృష్ణా (Krishna), గుంటూరు (Guntur), నెల్లూరు (Nellore) , బాపట్ల, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
ఇప్పటికే నిన్నటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ (Rayalaseema) జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తీరం వెంబడి ఉన్న నెల్లూరు, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు , గూడురు, సూళ్లురుపేట, కావలిలో రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. జనజీవనం స్థంబించిపోయింది. అల్పపీడనం ప్రభావంతో నాలుగు రోజుల పాటు తమిళనాడు, మూడురోజుల పాటు ఏపీపై ప్రభావం ఉంటుందని వివరించారు.