SL vs NZ 1st ODI : సొంతగడ్డపై శ్రీలంక బ్యాటర్లు మరోసారి చెలరేగారు. న్యూజిలాండ్ బౌలర్లను ఉతికేస్తూ సెంచరీలతో కదం తొక్కారు. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(143), వికెట్ కీపర్ కుశాల్ మెండిస్(100)లు శతకాలతో రెచ్చిపోయారు. పర్యాటక జట్టు బౌలింగ్ దళంపై దాడికి దిగి బౌండరీల వర్షం కురిపించారు. ఈ ఇద్దరి విధ్వంసంతో లంక రెండోసారి కివీస్‌పై మూడొందల స్కోర్ చేసింది. అయితే., మరో నాలుగు బంతుల్లో ఇన్నింగ్స్ ముగుస్తుందనగా వాన మొదలైంది. దాంతో, అంపైర్లు ఆటను కాసేపు నిలిపి వేశారు. అప్పటికీ శ్రీలంక స్కోర్.. 324-5.
టెస్టు సిరీస్‌తో పాటు పొట్టి సిరీస్‌లోనూ న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన శ్రీలంక వన్డే సిరీస్‌లోనూ విజయమే లక్ష్యంగా ఆడుతోంది. దంబుల్లాలో జరుగుతున్న తొలి వన్డేలో టాపార్డర్ దంచి కొట్టడంతో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(100) అదిరే ఆరంభం ఇవ్వగా.. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్(143) రెచ్చిపోయాడు. ఓపెనర్ పథుమ్ నిశాంక(12) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగినా ఈ ఇద్దరు క్రీజులో పాతుకుపోయారు.
No 150 for Kusal Mendis as his run-fest comes to an end 👏
Live: https://t.co/F9ftwY1VEj | #SLvNZ pic.twitter.com/fJIk7D0Z8a
— ESPNcricinfo (@ESPNcricinfo) November 13, 2024
కివీస్ బౌలర్లను విసిగిస్తూ కశాల్, అవిష్కలు బౌండరీల మోత మోగించారు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 2014 పరుగుల భాగస్వామ్యంతో లంక స్కోర్ బోర్డును ఉరికించారు. ఈ ఇద్దరి తర్వాత వచ్చిన కెప్టెన్ చరిత అసలంక(40) సైతం ధనాధన్ ఆడాడు. దాంతో, శ్రీలంక స్కోర్ మూడొందలు దాటేసింది. 50వ ఓవర్లో రెండు బంతులు పడగానే వాన అందుకుంది. దాంతో, అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్పటికీ జనిత్ లియాంగే(12 నాటౌట్) క్రీజులో ఉండగా లంక 5 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. ఇప్పటికే టెస్టు, టీ20 సిరీస్‌లు కోల్పోయిన కివీస్ వన్డే సిరీస్‌లోనైనా బోణీ కొడుతుందా? లేదా? చూడాలి.