Meenaakshi Chaudhary | దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేవారు అప్పట్లో. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే.. దీపం ఉన్నప్పుడే కెరీర్లో సెట్ చేసుకోవాలి అంటారు ఏమో. ప్రస్తుతం ఈ ఉదాహరణ సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లకు సరిగ్గా సరిపోతుంది. అవును ఇప్పటికే తమ కెరీర్ పీక్‌లో ఉండి పడిపోయిన నటీమణులు తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోగా.. తాజాగా ఈ లిస్ట్‌లో మరో హీరోయిన్ చేరబోతుంది. అవును తన కెరీర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న సమయంలో టాలీవుడ్‌కి చెందిన నటుడితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు ‘లక్కీ భాస్కర్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి. అవును మీనాక్షి చౌదరి అక్కినేని హీరో నాగార్జున మేనల్లుడు సుశాంత్‌తో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అడ్డా, లవ్లీ, కరెంట్, కాళిదాసు లాంటి సినిమాల్లో నటించి సుశాంత్ ప్రేక్షకులను అలరించారు. రీసెంట్గా అల వైకుంఠపురంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే సుశాంత్, మీనాక్షి చౌదరి కలిసి ఒక సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇచ్చట వాహనములు నిలపరాదు( Ichata Vahanamulu Niluparaadhu) అనే సినిమాలో జంటగా నటించారు వీళ్లిద్దరు. మీనాక్షి చౌదరి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కూడా ఈ చిత్రంతోనే. ఈ సినిమా సమయం నుంచే వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా జరుగబోతున్నట్లు సమాచారం. కాగా దీనిపై సుశాంత్, మీనాక్షి నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు నాగ చైతన్య పెళ్లి అనంతరం వీరిద్దరి పెళ్లి జరుగనున్నట్లు సమాచారం.
అయితే టాలీవుడ్లో ఈ తరహా పెళ్లిళ్లు కొత్తేమి కాదు. ఇంతకుమందు కెరీర్ పీక్‌లో ఉండి తర్వాత పడిపోయిన వారిలో కాజల్ అగర్వాల్, ఆసిన్, రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి, రహస్య గోరఖ్ ఉన్నారు. కాజల్ అగర్వాల్, ఆసిన్, రకుల్ ప్రీత్ సింగ్ వ్యాపారవేత్తలను ప్రేమించి పెళ్లి చేసుకోగా.. లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్‌ని, రహస్య గోరఖ్ కిరణ్ అబ్బవరంని పెళ్లి చేసుకున్నారు.