Japan Masters : ఒలింపిక్ విజేత, తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu) జపాన్ మాస్టర్స్‌ను విజయంతో ఆరంభించింది. ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా నెగ్గని సింధు తొలి పోరులో అలవోకగా గెలుపొందింది. సింధు జోరుకు ఎనిమిదో సీడ్ క్రీడాకారిణి తలొగ్గింది. దాంతో, సింధు జపాన్ మాస్టర్స్‌లో అదిరే బోణీ కొట్టింది.
పురుషుల విభాగంలో పోటీపడిన భారత స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ (Lakshya Sen) అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. జపాన్‌కు చెందిన అన్సీడెడ్కు పోటీ ఇవ్వలేక టోర్నీ నుంచి నిష్క్రమించాడు. బుధవారం ఉత్కంఠగా సాగిన మహిళల సింగిల్స్ 16వ రౌండ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఓంగ్బమ్రునంగ్పన్ను భారత షట్లర్ చిత్తుగా ఓడించింది. తొలి సెట్లో 5-7తో వెనకబడిన సింధు.. వెంటనే పుంజుకొని 11-9 ఆధిక్యంలోకి వచ్చింది. 21-12తో తొలి సెట్ సొంతం చేసుకున్న ఆమె.. రెండో సెట్లోనూ జోరు చూపింది.
Sindhu entered round of 16 in style, Lakshya goes down fighting at #JapanMasters2024#IndiaontheRise#Badminton pic.twitter.com/G8oUyR4kFm
— BAI Media (@BAI_Media) November 13, 2024
సింధు చాంపియన్ తరహాలో చెలరేగడంతో బసానన్ బదులివ్వలేకపోయింది. 21-8తో రెండో సెట్ కైవసం చేసుకున్న సింధు రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. మరోవైపు ఒలింపిక్ క్వార్టర్ ఫైనలిస్ట్ లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. అన్‌సీడెడ్ అయిన జపాన్ ఆటగాడు లియాంగ్ జున్ హావో చేతిలో 22-20, 17-21, 16-21తో సేన్ చిత్తు అయ్యాడు. ఇక మహిళల డబుల్స్‌లో త్రీసా జాలీ, గాయత్రి గోపిచంద్ జోడీ కూడా ఇంటిదారి పట్టింది.