Jarkhand elections : జార్ఖండ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయం ముగిసేటప్పటికీ 64.86 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ గణాంకాలు సుమారు అంచనాలు మాత్రమేనని, కచ్చితమైన ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది.
పోలింగ్ ముగిసే సమయానికి క్యూ లైన్లలో ఉన్న వారికి అధికారులు ఓటే వేసే అవకాశం కల్పించారు. దాంతో పలు పోలింగ్ బూత్‌లలో ఇంకా ఓటింగ్ కొనసాగుతోంది. దాంతో వివిధ పోలింగ్ బూత్‌లలో నమోదయ్యే ఓటింగ్ శాతం మారే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ కూడా 1 నుంచి 2 శాతం పెరిగే అవకాశం ఉంది.
కాగా జార్ఖండ్‌లోని మొత్తం 81 స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ముగిసింది. రెండో విడత పోలింగ్ ఈ నెల 20న జరగనుంది. ఈ నెల 23న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.