ICC : మహిళల పొట్టి ప్రపంచ కప్ టోర్నీకి మరింత ఆకర్షణ తెచ్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. పురుషల టోర్నీ మాదిరిగానే అమ్మాయిల జట్ల సంఖ్యను కూడా పెంచనుంది. ఇకపై మహిళల పొట్టి ప్రపంచ కప్‌లో 16 జట్లకు చాన్స్ ఇవ్వాలని తీర్మానించింది. అయితే.. ఈ నియమాన్ని 2030లోజరుగబోయే మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ప్రవేశపెట్టాలని ఐసీసీ భావిస్తోంది.
ఇప్పటివరకూ మెగా ఈవెంట్లో 12 జట్లు మాత్రమే ఆడుతున్నాయి. అయితే.. ఈమధ్య కాలంలో లపు దేశాలు మహిళా క్రికెట్‌ను ప్రోత్సహిన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల జట్లకు కూడా అంతర్జాతీయ వేదికపై ఆడే చాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ICC confirm Women’s T20 World Cup expansion to 16 teams in 2030
📷:ICC#icc #t20worldcup #newsupdate pic.twitter.com/W58uOkz8Re
— SportsTiger (@The_SportsTiger) July 22, 2024
‘మహిళల పొట్టి వరల్డ్ కప్‌ను 20230 నుంచి 16 జట్ల టోర్నీగా నిర్వహించేందుకు ఐసీసీ అంగీకరించింది. పురుషులతో సమానంగా మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. తొలి ఎడిషన్‌లో 8 జట్లు పాల్గొనగా 2016కి ఆ సంఖ్య 10కి చేరింది. 2026లో జరిగే ప్రపంచ కప్‌లో 12 జట్లు ఆడనున్నాయి. 2030లో జరిగే టోర్నీలో 16 టీమ్‌లు పాల్గొంటాయి’ అని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఈ ఏడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్(Bangladesh) వేదికగా టీ20 వరల్డ్ కప్ జరుగనుంది. అనంతరం రెండేండ్లకు అంటే.. 2026లో మెగా టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ రెండు టోర్నీల్లోనూ 12 జట్లను మాత్రమే ఐసీసీ అనుమతించనుంది. 2030 నుంచి 16 జట్లతో కొత్తగా టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ సన్నాహకాలు చేస్తోంది.