BANW vs THAIW | స్పిన్ అస్త్రానికి థాయ్‌లాండ్ విలవిల.. బంగ్లాదేశ్ లక్ష్యం..?
BANW vs THAIW : మహిళల ఆసియా కప్ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) బౌలర్లు చెలరేగారు. సోమవారం దంబుల్లా స్టేడియంలో థాయ్‌లాండ్ (Thailand)బ్యాటర్లను వణికిస్తూ వికెట్ల వేట కొనసాగించారు.
BANW vs THAIW : మహిళల ఆసియా కప్ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్(Bangladesh) బౌలర్లు చెలరేగారు. సోమవారం దంబుల్లా స్టేడియంలో థాయ్‌లాండ్ (Thailand)బ్యాటర్లను వణికిస్తూ వికెట్ల వేట కొనసాగించారు. లెగ్ స్పిన్నర్ రబియా ఖాన్(414) తిప్పేయడంతో థాయ్‌లాండ్ జట్టు 96 పరుగులకే పరిమితమైంది. థాయ్ బ్యాటర్లలో నథాయ బుచ్చాథామ్(40) ఒంటరి పోరాటం చేసింది. అమెకు సహకరించేవాళ్లు లేకపోవడంతో ప్రత్యర్థికి తేలికపాటి లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న థాయ్‌లాండ్‌కు ఓపెనర్లు శభారంభమిచ్చారు. నథాయ బుచ్చాథామ్(40) బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నది. అయితే.. లెగ్ స్పిన్నర్ రబియా ఖాన్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. పవర్ ప్లే తర్వాత బంతి అందుకున్న రబియా థాయ్ బ్యాటర్ల పని పట్టింది.
Rayeba with a magical spell 🪄#WomensAsiaCup2024 #ACC #HerStory #BANWvTHAIW pic.twitter.com/uxcod75LKr
— AsianCricketCouncil (@ACCMedia1) July 22, 2024
తొలుత ఓపెనర్ అఫిసర సువాంచోరథి(6)ని ఔట్ చేసిన ఆమె వరుస పెట్టి వికెట్లు తీసింది. బుచ్చాథామ్ను 16.5వ ఓవర్లో బౌల్డ్ చేసి థాయ్‌లాండ్‌ను పీకల్లోతు కష్టాల్లో పడేసింది. చివర్లో సులీపార్న్ లవోమి(17), రొసెనాన్ కనోహ్(13)లు పోరాటంతో జట్టు స్కోర్ 90 దాటించారు. అయితే.. థాయ్‌లాండ్ ఆలౌట్ ప్రమాదం తప్పించుకుంది కానీ వంద కూడా కొట్టలేకపోయింది.
ఇవి కూడా చదవండి
- Samyuktha Menon | సరికొత్త పోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నసంయుక్త మీనన్
- Farmer Suicide | ట్రాన్స్ఫార్మర్ తీగలు పట్టుకొని అప్పుల బాధతో రైతు ఆత్మహత్య.. నిర్మల్ జిల్లాలో ఘటన
- ICC | వరల్డ్ కప్ నష్టంపై సమీక్ష.. త్రిసభ్య కమిటీ ఏర్పాటు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

