YouTube | మొన్న మైక్రోసాఫ్ట్.. నేడు యూట్యూబ్‌లో అంతరాయం.. సోషల్ మీడియాలో తెగ వైరల్..!
YouTube | ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. తాజాగా యూట్యూబ్ సర్వీసులు సైతం డౌన్ అయ్యాయి. చాలా మంది యూజర్లు యాప్, వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
YouTube | ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. తాజాగా యూట్యూబ్ సర్వీసులు సైతం డౌన్ అయ్యాయి. చాలా మంది యూజర్లు యాప్, వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. డౌన్ డిటెక్టర్ ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి యూట్యూబ్‌లో సమస్యలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా యాప్ కారణంగా సమస్యలు ఎదుర్కొనట్లు యూజర్లు పేర్కొన్నారు.
33శాతం మంది యూజర్లు వీడియోలను అప్లోడ్ చేయడంలో ఇబ్బందులుపడ్డట్లుగా ఫిర్యాదు చేయగా.. 23శాతం మంది వెబ్సైట్ కారణంగా తిప్పలుపడ్డామని ఫిర్యాదు చేశారు. భారత్‌తో పాటు పలు దేశాల్లోనూ యూట్యూబ్‌లో అంతరాయం ఏర్పడింది. చాలామంది నెటిజన్లు యూట్యూబ్ సాంకేతిక సమస్యపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కొంతమంది ఎలాంటి సమస్య లేకుండా యాక్సెస్ చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. అప్లోడ్ సమయంలో ఇబ్బందులుపడ్డట్లుగా ఎక్స్ వేదికగా పలువురు పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో #YouTubeDown అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్‌గా మారింది. సాంకేతిక సమస్యపై యూట్యూబ్ అధికారిక ఎక్స్ వేదిక స్పందించింది. సమస్యను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపింది. సమస్య ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పింది.
యూట్యూబ్ అంతరాయానికి కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. నిర్వహణ కార్యకలాపాలు, లేకపోతే నెట్వర్క్ సమస్య కారణంగా ఇలా అయి ఉండవచ్చని భావిస్తున్నారు. యూట్యూబ్‌లో అంతరాయం కలిగిన సమయంలో క్యాచ్, కుకీలను క్లియర్ చేయాలని.. కొన్ని సందర్భాలలో వీటిని క్లియర్ చేయడం ద్వారా వెబ్సైట్ లోడింగ్ సమస్యను పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని.. ఇంటర్నెట్ కనెక్షన్‌ను తనిఖీ చేసుకోవాలని సందేశం చూపించింది. నెట్వర్క్ డౌన్ అయితే ప్రత్యామ్నాయ నెట్ వర్క్‌ను ఉపయోగించి యాక్సెస్ చేసుకునే ప్రయత్నం చేయండంటూ సూచించింది.
🔴 Guy’s… Let’s trend hashtag#YoutubeDown #youtubeproblem #YouTube
Retweet and like this if you are also facing same issue 😡@TeamYouTube @YouTubeIndia @YouTubeCreators— Piyush Joshi (@Piyush_j_7) July 22, 2024
YouTube is Down … uploaded videos are not showing in feed @YouTube @YouTubeIndia
— Harshit Yadav (@HarshitYoung) July 22, 2024
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

