TG Assembly | తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం మొదలవనున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభమవుతుంది. అనంతరం దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు అసెంబ్లీ సంతాపం తెలుపునున్నది. లాస్య నందితకు సంతాపం తెలిపే తీర్మానాన్ని సీఎం రేవంత్రెడ్డి సభలో ప్రవేశపెడుతారు. సంతాపం అనంతరం శాసనసభ నిరవధికంగా వాయిదాపడనున్నది. సభ వాయిదా అనంతరం సభా వ్యవహారాల కమిటీ భేటీ కానున్నది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల పనిదినాలు, అజెండాను బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఖరారు చేయనున్నది.