Asia Cup 2025 : ఈ ఏడాది ఆసియా కప్ టోర్నీకి తొలిసారి అర్హత సాధించిన హాంకాంగ్ (Hong Kong) కీలక నిర్ణయం తీసుకుంది. మెగా టోర్నీలో పెద్ద జట్లకు షాకివ్వాలనుకున్న ఆ జట్టు ఉపఖండానికి చెందిన మాజీ క్రికెటర్‌ను హెడ్‌కోచ్‌ను నియమించుకుంది. శ్రీలంక మాజీ ఓపెనర్ కౌశల్ సిల్వా (Kaushal Silva)ను ప్రధాన కోచ్‌గా ఆ దేశ బోర్డు ఎంపిక చేసింది. పెద్ద ఈవెంట్‌తోనే సిల్వా కోచింగ్ జర్నీ మొదలుకానుంది.
‘భవిష్యత్తులో హాంకాంగ్ క్రికెట్ పురోగతికి అంకింతభావం, ప్రతిభావంతులను రాటుదేల్చే నైపుణ్యం కలిగిన సిల్వా ఎంతో ఉపయోగపడతాడు. అతడి మార్గనిర్దేశనంలో మా జట్టు గొప్పగా ఆడుతుందనే నమ్మకం మాకుంది. అంతేకాదు మా దేశంలో క్రికెట్ వ్యాప్తి కూడా జరుగుతుందని అనుకుంటున్నాం’ అని సోమవారం హాకాంగ్ క్రికెట్ చైర్పర్సన్ బుర్జి ష్రాఫ్ ఒక ప్రకటనలో తెలిపాడు. కోచింగ్ బాధ్యతలపై సిల్వా స్పందిస్తూ.. క్రమశిక్షణతో పాటు గెలవాలనే కసిని హాంకాంగ్ క్రికెటర్లకు అలవర్చడమే తన లక్ష్యమని చెప్పాడు. సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ఆరంభం కానుండగా.. అదే రోజు అఫ్గనిస్తాన్‌తో హాంకాంగ్ తలపడనుంది.
Kaushal Silva, the former Sri Lanka Test opener, has been appointed Hong Kong men’s head coach https://t.co/pr4xDrk9jw pic.twitter.com/zb7m9lbXoD
— ESPNcricinfo (@ESPNcricinfo) July 28, 2025
టెస్టు ఓపెనర్‌గా శ్రీలంకకు శుభారంభాలు ఇచ్చిన కౌశల్ సిల్వా కుడి చేతివాటం బ్యాటర్. వికెట్ కీపర్ కూడా అయిన అతడు 2011 నుంచి 2018 మధ్య లంకకు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్లో కేవలం 39 టెస్టులు ఆడాడంతే. అనంతరం కోచ్‌గా అవతారమెత్తిన సిల్వా.. లకంతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లకు మెలకువలు నేర్పించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఘనమైన రికార్డు కలిగిన సిల్వా.. 41 శతకాలతో 13,932 రన్స్ సాధించాడు.