Sharwanand | కథను నమ్మి సినిమాలు చేసే అతికొద్ది మంది టాలీవుడ్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు శర్వానంద్. గతేడాది చివరగా మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శర్వానంద్. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి నారి నారి నడుమ మురారి. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీ విడుదల తేదీని ఇప్పటికీ ఫైనల్ చేయకపోవడానికి కారణమేంటని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. మేకర్స్ ఓటీటీ డీల్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్న కారణంగా విడుదల తేదీ ప్రకటించడంలో ఆలస్యం జరుగుతుందట. ఓటీటీ డీల్ సినిమా బిజినెస్‌లో చాలా కీలక పాత్ర పోషిస్తుందని తెలిసిందే. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫన్ ఎంటర్టైనర్గా రాబోతుంది.
ఈ చిత్రంలో భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్, ఏజెంట్ ఫేం సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఇరువురు భామల కౌగిలిలో స్వామి , ఇరుకున పడి నీవు నలిగితివా అంటూ షేర్ చేసిన పోస్టర్ ఒకటి నెట్టింట హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్ మరోవైపు అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో Sharwa 36లో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తోంది.
Hathnoora | ఆదాయం ఉన్న సౌకర్యాలు సున్నా.. పలుగు పోచమ్మ ఆలయం వద్ద భక్తుల ఇక్కట్లు
Roads | సారూ మా రోడ్లు బాగు చేయరా.. బురద రోడ్లపై వరినాట్లు వేసి నిరసన
Additional collector Nagesh | ప్రాజెక్టులు, చెరువుల దగ్గరికి ఎవరూ వెళ్లొద్దు : అదనపు కలెక్టర్ నగేష్