Harmanpreet Kaur : భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) రిలాక్స్ అవుతోంది. మైదానంలో నీలి రంగు జెర్సీతో ‘మిస్టర్ కూల్’గా కనిపించే ఆమె స్టయిల్ సింబల్‌గా, ఫ్యాషన్‌కు కేరాఫ్‌గా మారిపోయింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే స్టయిల్‌గా తయారయ్యే హర్మన్‌ప్రీత్ తాజాగా కొత్త గెటప్‌లో కనిపించింది.
స్టయిలిష్ లుక్‌లో అచ్చం సినిమా హీరోయిన్, మోడల్‌ను తలపించిన హర్మన్‌ప్రీత్ అభిమానులను ఒకింత ఆశ్చర్యపరిచింది. వింటేజ్ కారు పక్కన ప్యాంట్, సూట్, కళ్లజోడు ధరించిన హర్మన్‌ప్రీత్ నేను ఈతరం అమ్మాయినే అని చాటుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక (Srilnaka) చేతిలో అనూహ్యంగా ఓడిన టీమిండియా టీ20 వరల్డ్ కప్‌లోనూ తేలిపోయింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాంతో, మరోసారి భారత్‌కు పొట్టి కప్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. తొలిసారి 2020లో ఫైనల్ చేరిన టీమిండియా అనూహ్యంగా కప్ చేజార్చుకుంది. ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.