West Indies Squad : స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్ (West Indies) త్వరలోనే టెస్టు సిరీస్‌తో బిజీ కానుంది. మళ్లీ సొంతగడ్డపైనే బంగ్లాదేశ్(Bangladesh)తో కరీబియన్ జట్టు రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు సమయం దగ్గరపడడంతో శనివారం విండీస్ సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. క్రెగ్ బ్రాత్‌వైట్ (Kraigg Brathwaite) కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని సిరీస్ కోసం ఎంపకి చేశారు.
అయితే.. స్టార్ స్పిన్నర్ గుడకేశ్ మోతీకి మాత్రం స్క్వాడ్‌లో చోటు దక్కలేదు. అలాగే భుజం గాయం నుంచి కోలుకోని ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను కూడా పక్కన పెట్టేశారు. ఇక గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధించిన కెవిన్ సింక్లెయినర్ టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు.
Jason Holder not included as he continues his shoulder rehabilitation; Gudakesh Motie gets left out while Kevin Sinclair returns from Injury https://t.co/IUyyAaOsm2 | #WIvBAN pic.twitter.com/nnF0nMOT5x
— ESPNcricinfo (@ESPNcricinfo) November 16, 2024
వెస్టిండీస్ స్క్వాడ్ : క్రెగ్ బ్రాత్‌వైట్(కెప్టెన్), జోషు డిసిల్వా(వైస్ కెప్టెన్), అలిక్ అథనజే, కేసీ కార్టీ, జస్టిన్ గ్రేవ్స్, కవెమ్ హొడ్గే, తెవిన్ ఇమ్లచ్, మికిలే లూయిస్, కెవిన్ సింక్లెయిర్, అండర్సన్ ఫిలిప్, జొమెల్ వార్రికన్, అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్, జైడెన్ సీల్స్, షమర్ జోసెఫ్.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో వెనకబడిన వెస్టిండీస్ స్వదేశంలో బంగ్లాదేశ్ సవాల్‌కు కాచుకొని ఉంది. ఈమధ్యే భారత జట్టు చేతిలో వైట్‌వాష్‌కు గురైన బంగ్లా రెండు టెస్టుల సిరీస్‌లో విండీస్‌కు గట్టి పోటీ ఇవ్వాలనుకుంటోంది. సిరీస్‌లో భాగంగా నవంబర్ 22న తొలి టెస్టు జరుగనుంది. అనంతరం నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకూ జరిగే రెండో రెండో టెస్టులో ఇరుజట్లు ఢీకొంటాయి.