Watch: ఇంట్లోకి ప్రవేశించి పెంపుడు కుక్కపై చిరుత దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?
Leopard Attacks Pet Dog | ఒక ఇంటి ఆవరణలోకి చిరుత ప్రవేశించింది. అక్కడున్న పెంపుడు కుక్కపై అది దాడి చేసింది. దాని మెడ కొరికి చంపి తినేందుకు ప్రయత్నించింది. అయితే కుక్క అరుపులు విన్న యజమానురాలు అక్కడకు వచ్చింది.
జైపూర్: ఒక ఇంటి ఆవరణలోకి చిరుత ప్రవేశించింది. అక్కడున్న పెంపుడు కుక్కపై అది దాడి చేసింది. (Leopard Attacks Pet Dog) దాని మెడ కొరికి చంపి తినేందుకు ప్రయత్నించింది. అయితే కుక్క అరుపులు విన్న యజమానురాలు అక్కడకు వచ్చింది. దీంతో చిరుత కుక్కను వదిలి అక్కడి నుంచి పారిపోయింది. ఆ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్లోని మౌంట్ అబూలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సన్రైజ్ వ్యాలీలోని ఒక ఇంటి గార్డెన్లో నల్ల కుక్క ఉన్నది. ఒక చిరుత గోడ దూకి అక్కడకు వచ్చింది. పెంపుడు కుక్క లాబ్రడార్ రిట్రీవర్పై అది దాడి చేసింది. కుక్క మెడను నోటితో పట్టుకుని కొరికి చంపేందుకు ప్రయత్నించింది. అయితే చిరుత బారి నుంచి తప్పించుకునేందుకు ఆ కుక్క తెగ పెనుగులాడింది.
కాగా, పెంపుడు కుక్క అరుపులు విన్న యజమానురాలు కేకలు వేస్తూ అక్కడకు వచ్చింది. అయితే ఆమె రాకను గమనించిన చిరుత ఆ కుక్కను వదిలేసింది. ఆ ఇంటి నుంచి బయటకు పరుగెత్తింది. ఆ చిరుతను వెంబడించేందుకు కుక్క ప్రయత్నించింది. ఓనర్ అయిన మహిళ డోర్ తీయడంలో ఇంటి లోపలకు అది వెళ్లింది. మరోవైపు ఆ ఇంటి ఆవరణలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Shocking incident in Mount Abu as a panther attacks a dog near Forest Eco Lodge. 🐾 This has raised safety concerns among tourists, especially after similar incidents in Udaipur. Stay alert and follow safety guidelines if you’re visiting! #MountAbu #WildlifeSafety #PantherAttack… pic.twitter.com/psP7dbSwK7
— Pradeep Singh (@PBeedawat) November 15, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

