Harmanpreet Kaur : స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు(Womens Team) సత్తా చాటింది. ఏకంగా మిడిలార్డర్లోని నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. దాంతో, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి హర్మన్‌ప్రీత్ కౌర్(HarmanPreet Kaur) సేన 7 వికెట్ల నష్టానికి 410 రన్స్ కొట్టి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఒక్క రన్ తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకుంది. ఇలా ఆమె ఔటవ్వడం ఇది రెండోసారి. వన్డేల్లో ఓసారి ఆస్ట్రేలియాపై ఇదే తరహాలో వెనుదిరిగింది.
క్రీజులో కుదురుకున్న హర్మన్‌ప్రీత్ 49 పరుగుల వద్ద ఉన్నప్పుడు సింగిల్ తీయాలనుకుంది. కానీ, బంతిని గమనించిన నాన్‌స్ట్రయికర్ యస్తికా భాటియా(66) పరుగుకు నిరాకరించి వెనక్కి పంపింది. దాంతో రనౌట్ తప్పించుకునేందుకు ఆమె క్రీజువైపు పరుగెత్తింది. గీతపై బ్యాటు కూడా పెట్టింది. అయితే.. ఊహించనివిధంగా బ్యాటు క్రీజులో ఇరుక్కపోయింది. అప్పటికే డానియెల్లే వ్యాట్ విసిరిన బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. దాంతో, థర్డ్ అంపైర్ రిప్లే అనంతరం హర్మన్‌ప్రీత్‌ను ఔట్‌గా ప్రకటించారు. దాంతో, ఆమె నిరాశగా పెవిలియన్ బాట పట్టింది.
And again Harmanpreet Kaur gets out similar fashion…#HarmanpreetKaur #INDvENG pic.twitter.com/lX4QZLnYAl
— Ajay Ahire (@Ajayahire_cric) December 14, 2023
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు స్మృతి మంధాన(17), షెఫాలీ వర్మ(19) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. దాంతో, కష్టాల్లో పడిన జట్టును సుభా సతీశ్(69), జెమీమా రోడ్రిగ్స్(68) ఆదుకున్నారు. వీళ్లిద్దరూ క్రీజులో పాతుకుపోయి ఇంగ్లండ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 115 పరుగులు జోడించారు.
Early wickets and a rock-solid partnership between debutants 👊#INDvENG Test gets off to a 🔥 start!
📝: https://t.co/sRuacOXBsw pic.twitter.com/CrLzuA9tSC
— ICC (@ICC) December 14, 2023
ఆ తర్వాత వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్(49) హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. యస్తికా భాటియా, దీప్తి శర్మ(66 నాటౌట్) ధనాధన్ ఆటతో ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించారు. దాంతో, టీమిండియా తొలి రోజే 410 రన్స్ కొట్టింది. ఈ మ్యాచ్‌తో సతీశ్ సుభా, జెమీమా రోడ్రిగ్స్, పేసర్ రేణుకా సింగ్ టెస్టుల్లో అరంగేట్రం చేశారు. ఈ ముగ్గురు మ్యాచ్ ప్రారంభానికి ముందు తమ టెస్టు డెబ్యూ క్యాప్ అందుకున్నారు.
Cameron Green | పుట్టుకతోనే మూత్రపిండాల సమస్య.. 12 ఏండ్లు మాత్రమే బతకాల్సినవాడిని
IPL 2024 | నితీశ్ రానాకు ఝలక్.. కోల్‌కతా సారథిగా శ్రేయస్ అయ్యర్..!
AUS vs PAK | తొలి టెస్టులో వార్నర్ శతక గర్జన.. పటిష్ట స్థితిలో ఆస్ట్రేలియా