AUS vs PAK : స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా(Australia) పట్టు బిగిస్తోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి కమిన్స్ సేన 5 వికెట్ల నష్టానికి 346 రన్స్ కొట్టింది. పెర్త్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(164 : 211 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లు) తన తడాఖా చూపించాడు.
పాక్ బౌలర్లను ఉతికారేసిన డేవిడ్ భాయ్ శతకంతో చెలరేగాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(41), వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్(40) రాణించడంతో ఆసీస్ స్కోర్ బోర్డు మూడొందలు దాటింది. ఆట ముగిసే సమయానికి ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(15 నాటౌట్), వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(14) క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో అమీర్ జమాల్ ఒక్కడే రెండు వికెట్లతో మెరిశాడు.
డేవిడ్ వార్నర్(164)
టాస్ గెలిచిన కమిన్స్ బ్యాటింగ్ తీసుకున్నాడు. సొంతగడ్డపై దంచికొట్టే వార్నర్, ఖవాజా ఎప్పటిలాగే అదే పనిచేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 126 రన్స్ జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని షాహీన్ ఆఫ్రిది విడదీశాడు. ఖవాజా ఔటయ్యాక.. వార్నర్ మరింత దూకుడుగా ఆడాడు. బౌండరీలు, సిక్సర్లతో పాక్ బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు.
What a player 🔥#WTC25 | #AUSvPAK | https://t.co/S2dy31gkVF pic.twitter.com/0COoD0hTWL
— ICC (@ICC) December 14, 2023
మార్నస్ లబూషేన్(16), స్టీవ్ స్మిత్(31)తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన వార్నర్ సెంచరీ సాధించాడు. డబుల్ సెంచరీకి చేరువవుతున్న అతడిని అమీర్ జమాల్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత వచ్చిన మార్ష్, క్యారీ మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. దాంతో, ఆసీస్ తొలి రోజే 346 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది.