న్యూఢిల్లీ : శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ (Generative AI phones) రియల్‌టైం కాల్ ట్రాన్స్‌లేషన్స్, సర్కిల్ సెర్చి వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్స్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. గూగుల్ పిక్సెల్ 8కి దీటుగా గెలాక్సీ ఎస్24, గెలాక్సీ ఎస్24 ప్లస్, గెలాక్సీ ఎస్24 అల్ట్రా రానున్నాయని అంచనా వేస్తున్నారు. గెలాక్సీ ఎస్24 సిరీస్ ఏఐ ఫీచర్లతో ఆకట్టుకుంటుందని, గెలాక్సీ ఎస్24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఏఐ పవర్డ్ సర్కిల్ సెర్చ్ ఫీచర్‌తో రానుందని టెక్ నిపుణులు అహ్మద్ఖైదర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
వీటికి తోడు వాయిస్ రికార్డర్ ఫీచర్ ద్వారా పది వాయిస్‌ల వరకూ ఈ ఫీచర్ గుర్తిస్తుంది. ఈ రికార్డర్ సంభాషణాలను ట్రాన్స్‌లేట్ చేయడం, మీటింగ్ సమ్మరీస్ను జనరేట్ చేయడం వంటివి చేయడంలో ఉపకరిస్తుంది. ఆడియో కాల్స్ సందర్భంగా 14 భాషల్లో రియల్ టైం ట్రాన్స్లేషన్స్ను చేపట్టే ఆన్ డివైజ్ ఏఐ ఫీచర్‌తో గెలాక్సీ ఎస్24 సిరీస్ కస్టమర్ల ముందుకొస్తుందని చెబుతున్నారు.
థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండానే ఈ సిరీస్ స్మార్ట్ఫోన్లలో 35 భాషల వరకూ ట్రాన్స్లేషన్ సామర్ధ్యాలను మెరుగుపర్చుకోవచ్చని చెబుతున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ కంపెనీ తొలి జనరేటివ్ ఏఐ ఫోన్స్‌గా మార్కెట్ చేయనున్నట్టు సమాచారం. ఇక మెరుగైన బ్యాటరీ లైఫ్ కోసం గెలాక్సీ ఎస్24 సిరీస్‌లో శాంసంగ్ ఈవీ టెక్నాలజీని వాడుతోందని చెబుతున్నారు.
Read More :
itel A05s | న్యూ స్టోరేజీ వేరియంట్‌తో ఐటెల్ ఏ05ఎస్.. రూ.6,099లకే లభ్యం..!