itel A05s | న్యూ స్టోరేజీ వేరియంట్‌తో ఐటెల్ ఏ05ఎస్.. రూ.6,099లకే లభ్యం..!
tel A05s | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘ఐటెల్ (itel)’ తన ఎంట్రీ లెవెల్ ఫోన్ ఐటెల్ ఏ05ఎస్ (itel A05s) మరో వేరియంట్ ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
itel A05s | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘ఐటెల్ (itel)’ తన ఎంట్రీ లెవెల్ ఫోన్ ఐటెల్ ఏ05ఎస్ (itel A05s) మరో వేరియంట్ ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. తొలుత 2జీబీ ర్యామ్ విత్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్‌ను ఆవిష్కరించిన ఐటెల్.. తాజాగా 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ తీసుకొచ్చింది. కొత్త వేరియంట్ ఫోన్లో 5-మెగా పిక్సెల్ కెమెరా సెటప్ స్థానే 8 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
ఐటెల్ ఏ05ఎస్ ధరలు ఇలా
- ఐటెల్ ఏ05ఎస్ ఫోన్ 2జీబీ ర్యామ్ విత్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.6,499.
- కానీ, న్యూ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.6,099 మాత్రమే.
దేశంలోని ప్రధాన రిటైల్ ఔట్లెట్లలో ఐటెల్ ఏ05ఎస్ ఫోన్ లభిస్తుంది. - ఐటెల్ ఏ05ఎస్ ఫోన్ గ్లోరియస్ ఆరెంజ్, నెబులా బ్లాక్, మేడౌ గ్రీన్, క్రిస్టల్ బ్లూ కలర్ ఆప్షన్లలో పొందొచ్చు.
ఇవీ స్పెషిఫికేషన్స్
- ఐటెల్ ఏ05ఎస్ ఫోన్ 6.6 అంగుళాల హెచ్డీ + డ్రాప్ డిస్ ప్లే విత్ 1600 x720 పిక్సెల్స్ అండ్ 60 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్.
- ఎంట్రీ లెవెల్ ఐటెల్ ఏ05ఎస్ ఫోన్ 1.6 గిగా హెర్ట్జ్ ప్రాసెసర్‌తో వస్తుంది.
- 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ వర్షన్‌పై పని చేస్తుంది.
- 8 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం ఏఐ బ్యూటిఫికేషన్ మోడ్‌లో 5 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
- 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. అలాగే సెక్యూరిటీ కోసం రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్, డ్యుయల్ 4జీ వోల్డ్ సపోర్ట్, పలు కనెక్టివిటీ ఆప్షన్లు కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

