IND vs ENG : సిరీస్‌లో చివరిదైన ఓవల్ టెస్టులో భారత పేసర్ సిరాజ్ (3-66) నిప్పులు చెరుగుతున్నాడు. బుల్లెట్ బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను వణికిస్తున్నాడీ స్పీడ్‌స్టర్. లంచ్ తర్వాత రెచ్చిపోయిన సిరాజ్ మూడో వికెట్ సాధించాడు. జో రూట్(29)ను ఎల్బీగా ఔట్ చేసి ఆతిథ్య జట్టును దెబ్బకొట్టిన మియా భాయ్ కొత్త కుర్రాడు జాకబ్ బెథెల్(6)ను యార్కర్‌తో వెనక్కి పంపాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ ఆరుగురిని అతడు ఎల్బీగా వెనక్కి పంపడం విశేషం.
భోజన విరామం తర్వాత వరుసగా ఏడో ఓవర్ వేసిన సిరాజ్ ఆడడానికి ఏమాత్రం వీలులేని బంతితో బెథెల్ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. అంతే.. ఇంగ్లండ్ 195కే ఐదో వికెట్ కోల్పోయింది. భారత స్కోర్‌ను అధిగమించేందుకు ఇంకా 28 రన్స్ వెనుకంజలో ఉంది పోప్ సేన. కష్టాల్లో పడిన జట్టును హ్యారీ బ్రూక్(22 నాటౌట్), ఆపద్భాందవుడు జేమీ స్మిత్(5 నాటౌట్)లు గట్టెక్కించే బాధ్యత తీసుకున్నారు.
Pope ❌
Root ❌
Bethell ❌Siraj is on a roll! 🔥 pic.twitter.com/AiBxusxg04
— ESPNcricinfo (@ESPNcricinfo) August 1, 2025
ఓవల్ టెస్టులో భోజన విరామం తర్వాత భారత బౌలర్లు దడపుట్టిస్తున్నారు. అర్ధ శతకం తర్వాత జోరు పెంచిన ఓపెనర్ జాక్ క్రాలే(64)ను ప్రసిధ్ కృష్ణ వెనక్కి పంపి వికెట్ల వేటకు తెర తీశాడు. ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న షార్ట్ బంతిని గాల్లోకి లేపిన క్రాలే.. జడ్డూ చేతికి దొరికాడు. దాంతో రెండో వికెట్ విలువైన భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే జట్టును ఆదుకోవాలనుకున్న కెప్టెన్ ఓలీ పోప్(22) ఆటకు సిరాజ్ (3-66) ముగింపు పలికాడు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే.. డేంజరస్ జో రూట్(29)ను ఎల్బీగా ఔట్ చేసి జట్టులో జోష్ తెచ్చాడు. అదే ఉత్సాహంతో జాకబ్ బెథెల్(6)ను సూపర్ యార్కర్‌తో ఎల్బీగా పెవిలియన్ పంపిన ఈ స్పీడ్‌స్టర్ ఇంగ్లండ్‌ను ఆలౌట్ అంచున నిలిపాడు.