ECB : సొంతగడ్డపై త్వరలో జరుగబోయే భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ (England) సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే జింబాబ్వే (Zimbabwe)తో ఏకైక టెస్టు ఆడనుంది బెన్ స్టోక్స్ (Ben Stokes) బృందం. మే 22న మ్యాచ్ ఉన్నందున ఇంగ్లండ్ మంగళవారమే తమ తుది జట్టును ప్రకటించింది. యువ పేసర్ సామ్ కుక్ (Sam Cook) ఈ మ్యాచ్‌తో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేయనున్నాడు. అట్కిన్సన్, జోష్ టంగ్‌తో కలిసి అతడు కొత్త బంతిని పంచుకుంటాడని హెడ్ కోచ్ మెక్కల్లం వెల్లడించాడు. 2003 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై జింబాబ్వేకు ఇదే తొలి టెస్టు కావడం విశేషం.
ఈ ఏడాది సమ్మర్లో ఇంగ్లండ్ పురుషుల జట్టుకు ఇదే తొలి టెస్టు మ్యాచ్. దాంతో, విజయంతో సీజన్‌ను ఆరంభించాలని బెన్ స్టోక్స్ సేన భావిస్తోంది. అందుకే.. కీలకమైన ఆటగాళ్లకు తుది జట్టులో చోటు కల్పించింది. దేశవాళీలో ఎస్సెక్స్ జట్టు తరఫున వికెట్ల వేట కొనసాగిస్తున్న సామ్ కుక్ ఈ టెస్టుతో డెబ్యూట్ క్యాప్ అందుకోనున్నాడు.
ఇంగ్లండ్ తుది జట్టు : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్(వికెట్ కీపర్), గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, సామ్ కుక్, షోయబ్ బషీర్.
England’s XI for the one-off four-day Test against ZImbabwe in Nottingham 🏴 pic.twitter.com/NN6TK0S8yv
— ESPNcricinfo (@ESPNcricinfo) May 20, 2025
డొమెస్టిక్ క్రికెట్లో నిప్పులు చెరుగుతున్న కుక్ 89 మ్యాచుల్లో 321 వికెట్లతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దాంతో, టీమిండియా సిరీస్‌కు పేస్ అస్త్రంగా పనికొస్తాడని సెలెక్టర్లు ఈ కుర్రాడిని జింబాబ్వే మ్యాచ్‌కు ఎంపిక చేశారు. అయితే..పేసర్లు జేమ్స్ రెవ్, మాథ్యూ పాట్స్‌కు మాత్రం నిరాశే మిగిలింది. స్టోక్స్ బృందం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC 2025-27) కొత్త సైకిల్లో భాగంగా జూన్‌లో టీమిండియాను ఢీకొట్టనుంది. సో.. ఈ మ్యాచ్ ఇంగ్లండ్‌కు ప్రాక్టీస్‌గానే కాకుండా ఆత్మవిశ్వాసం కూడదీసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడనుంది.