AITUC | జగిత్యాల, మే 21 : శతాబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను యధావిధంగా అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు, ప్రధాన కార్యదర్శి ఎండి ముక్రంలు డిమాండ్ చేశారు. ఇవాళ ఏఐటీయూసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టిన అనంతరం కలెక్టరెట్లో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటీష్ పాలనలో స్వతంత్ర పోరాటమునకు ముందు నుంచి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి.. నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి పెట్టుబడి దారులకు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉండే విధంగా అమలు చేయటానికి తీవ్రంగా ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
నాలుగు లేబర్ కోడ్ల వల్ల ఎనిమిది గంటల పనికి బదులు 12 గంటలు కార్మికులు ఉద్యోగులు పనిచేయవలసి ఉంటుందన్నారు. అసంఘటిత రంగ కార్మికులైన బీడీ, అంగన్వాడీ, ఆశ, హమాలి, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కనీస వేతనాలు అమలు లేవని.. సమాన పనికి సమాన వేతనం లేదని కేంద్ర ప్రభుత్వం వీరిని స్కీం వర్కర్లుగా గుర్తించడం లేదని సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేయడం లేదని విమర్శించారు.
సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంఘాలు, ఆల్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె మే 20న తలపెట్టినట్టు వారు తెలిపారు. కశ్మీర్లో టూరిస్టులపై, అమాయక ప్రజలను ఉగ్రవాదులు దాడి చేసి చంపడం వల్ల మన సైనిక దళాలు బార్డర్లో యుద్ధ వాతావరణం నెలకొన్న దృష్ట్యా శాంతి వాతావరణంలో చర్చలు జరుగుతున్న సమయంలో కేంద్రంలోని కార్మిక సంఘాలు చర్చించి ఈ సమ్మెను జూలై 9న తిరిగి చేపడతామని నిర్ణయించినట్లు తెలిపారు. అప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని రాములు, ముక్రంలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నేతలు ఇరుగురాల భూమేశ్వర్, వెన్న మహేష్, రామిల్ల రాంబాబు, మునుగూరు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
Karimnagar | బొమ్మనపల్లిలో అగ్ని ప్రమాదం.. రూ. 2 లక్షలకు పైగా నష్టం..
Landslides | కైలాస్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన వందలాది మంది యాత్రికులు
Warangal fort | కోటను సందర్శించిన రాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ